Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..
నటి అభినయ గురించి పరిచయం అవసరం లేదు. శంభో శివ శంభో సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే అభినయకు మాటలు రావు.. చెవులు వినబడవు. అయినప్పటికీ ప్రతి పాత్రకు ప్రాణం పోసింది. అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఆమె నటించిన చిత్రాలు.. పోషించిన పాత్రుల ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాయి.

నటి అభినయ, ఆమె తండ్రి ఆనంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబ బంధాలు, అభినయ కెరీర్, ఆమె జీవితం పట్ల ఆశావహ దృక్పథం గురించి వివరంగా పంచుకున్నారు. అభినయ వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం ఏమిటంటే, ఆమె తన లోపాన్ని ఎప్పుడూ ఒక సమస్యగా భావించలేదని, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటుందని ఆమె తండ్రి ఆనంద్ తెలిపారు. గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం ఆమె మరో అద్భుతమైన గుణమని అన్నారు. కోపం వంటి విషయాల్లో పెద్దవారు సర్దుకుపోవాలని, అభినయ తల్లితో తాను మాట్లాడినంత సన్నిహితంగా ఆమెతో మాట్లాడలేకపోవడం తన లోపమని ఆనంద్ భావోద్వేగంగా వెల్లడించారు. అభినయ తన జీవితంలో ఎప్పుడూ డిప్రెషన్‌కు గురికాలేదని, తన పరిస్థితిని సహజంగానే అంగీకరిస్తానని స్పష్టం చేశారు. తన తల్లి ఎప్పుడూ తనతోనే ఉంటారని, తండ్రి బిజీగా ఉన్నప్పటికీ తమ మధ్య మంచి బంధం ఉందని చెప్పారు. తండ్రి బిజీగా ఉంటారని తనకు తెలుసని, ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అభినయ తెలిపారు. డ్యాన్స్ పట్ల తనకున్న మక్కువను, చెన్నైలో డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో తన నృత్యాన్ని ప్రదర్శించడం గురించి పంచుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
తన నాన్నమ్మకు ఎంతో రుణపడి ఉంటానని, ఈరోజు తాను నడుస్తూ, మాట్లాడుతున్నానంటే ఆమె కారణమని అభినయ ఉద్వేగంగా తెలిపారు. ఆమె తనకు జీవితాన్ని ఇచ్చిందని, సైన్ లాంగ్వేజ్‌లోనూ ఆమెతో మాట్లాడుతుందని చెప్పారు. ఒకప్పుడు హాస్పిటల్‌లో చేరిన నాన్నమ్మ గురించి తాను ఎంత ఆందోళన చెందానో గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఆనంద్ ఎప్పుడూ నటుడు కావాలని కలలు కన్నారని, తాను ఆ కలను నెరవేర్చడం సంతోషంగా ఉందని అభినయ అన్నారు. తన దృష్టిలో తన తండ్రి దేవుడితో సమానమని, గొప్ప హృదయం కలిగిన, సానుకూల వ్యక్తి అని ప్రశంసించారు.
దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుందని చెప్పారు. అభినయ పెళ్లి తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తే, హైదరాబాద్‌లో ఉంటే తరచుగా కలుస్తానని, ఇతర ప్రాంతాలకు వెళితే దేవుడి ప్లాన్ చూడాలని అన్నారు. దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులకు దయచేసి వారిని వదిలివేయవద్దని, అది మన బాధ్యత అని అభినయ విజ్ఞప్తి చేశారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
