AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాది పొడవునా మామిడి రుచి కావాలా? అయితే నోరూరించే ఒరుగులు ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోండి!

మామిడి పండ్ల సీజన్ రాగానే మనం రకరకాల పచ్చళ్లు, ఆవకాయలు పెట్టుకుంటాం. అయితే, మామిడికాయను ఎండబెట్టి నిల్వ చేసుకునే ఒరుగులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..? మామిడికాయలను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడానికి ఒరుగుల తయారీ పాతకాలపు పద్ధతి అయినా ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందింది. వీటి తయారీ చాలా సులభం, ఆరోగ్యకరం కూడా. తెలంగాణ, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఈ పద్ధతిని మీరు కూడా ప్రయత్నించవచ్చు.

Jyothi Gadda
|

Updated on: Apr 04, 2026 | 1:03 PM

Share
ఒరుగుల తయారీ విధానం: బాగా ముదిరిన, పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలను ఎంచుకోవాలి.. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. మామిడికాయ పైన తొక్క తీసేసి (మీకు ఇష్టమైతే తొక్కతో కూడా ఉంచవచ్చు), మీకు కావలసిన పరిమాణంలో సన్నని పొడవాటి ముక్కలుగా కోయాలి.

1 / 5
ఒక గిన్నెలో మామిడి ముక్కలను తీసుకుని, అందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఉప్పు ముక్కలకు పట్టి నీరు ఊరుతుంది. ఈ ముక్కలను ఒక పొడి గుడ్డపై లేదా వెడల్పాటి ప్లేట్‌లో వేసి ఎండలో పెట్టాలి. ముక్కలు విడివిడిగా ఉండేలా చూసుకోవాలి. తేమ పూర్తిగా పోయి, ముక్కలు ముడుచుకుపోయి గట్టిగా అయ్యే వరకు (సుమారు 3-4 రోజులు) ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన ముక్కలను గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరుచుకోవాలి.

2 / 5
మామిడి ఒరుగులను గ్రైండ్ చేస్తే స్వచ్ఛమైన ఆమ్చూర్ పొడి (Dry Mango Powder) తయారవుతుంది. దీనిని చాట్ మసాలాల్లో వాడవచ్చు. కొందరు పిల్లలు ఈ ఉప్పు, పసుపు కలిసిన ఎండిన ముక్కలను నేరుగా తినడానికి కూడా ఇష్టపడతారు.

3 / 5
ఒరుగులతో ఉపయోగాలు కూడా అనేకం ఉన్నాయి. మామిడికాయ పప్పు, సాంబార్, మామిడి ఒరుగుల పచ్చడి, మామిడి ఆవకాయ వంటి వంటకాల్లో వీటిని వాడతారు. చింతపండు అందుబాటులో లేనప్పుడు లేదా మామిడి పులుపు కావాలనుకున్నప్పుడు పప్పు, చారు లేదా మాంసాహార కూరల్లో వీటిని వేయవచ్చు. మామిడి రుచి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. పచ్చి మామిడికాయల పుల్లని, ఘాటైన రుచిని అలాగే కలిగి ఉంటాయి.

4 / 5
ఆరోగ్యపరంగా కూడా ఒరుగులు మంచివి. విటమిన్ సి, పెక్టిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెమికల్స్ ఉండే నిల్వ పదార్థాల కంటే ఇలా ఇంట్లోనే సహజంగా మామిడిని భద్రపరుచుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మామిడి సీజన్ ముగియక ముందే మీరు కూడా మామిడి ఒరుగులను తయారు చేసి పెట్టుకోండి!

5 / 5
Follow Us
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే

తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!

సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..

బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం

కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?

చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి

ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య

జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..