గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం
యుద్ధం ఎవరికి ఏం మిగుల్చుతుందో తెలియదు కానీ, అమాయక బాల్యాన్ని మాత్రం చిదిమేస్తుందని గాజా నుంచి వస్తున్న దృశ్యాలు నిరూపిస్తున్నాయి. నిత్యం బాంబుల మోత, క్షతగాత్రుల ఆర్తనాదాలు, శవయాత్రల మధ్య పెరుగుతున్న గాజా చిన్నారులపై యుద్ధ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్నారుల మనస్తత్వం ఎంతలా దెబ్బతిందో చెప్పడానికి ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో సజీవ సాక్ష్యంగా చెప్పవచ్చు. గాజాలో మరణం ఎంత నిత్యకృత్యంగా మారిందో, ఒక అంతిమ యాత్ర పిల్లలకు సరదా ఆటగా ఎలా మారిందనే నిజం ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. కొంతమంది చిన్నపిల్లలు కలిసి ఒక బొమ్మను పాడెపై శవాన్ని ఎత్తినట్టు అతి జాగ్రత్తగా పైకెత్తి, చిన్న స్ట్రెచ్చర్‌పై ఉంచారు. దానిని భుజాన వేసుకుని, పెద్దల శవయాత్ర మాదిరిగా మౌనంగా, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. మరికొందరు పిల్లలు వారి వెనుక మౌనంగా అనుసరిస్తున్నారు. చూసేవారికి ఇది ఒక ఆటలా అనిపించినా, దాని వెనుక ఉన్న ఆవేదన వర్ణనాతీతం.ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ప్రతీ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కళ్ల ముందే జరుగుతున్న ఈ దారుణాలు, అంతిమ యాత్రలు వారి లేత మనసులపై తీవ్ర ప్రభావం చూపాయి. చుట్టూ జరుగుతున్న మరణాలనే వారు తమ ఆటగా మార్చుకున్నారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. బాల్యం అంటే ఆటపాటలతో సాగాలి, కానీ ఇక్కడ మృత్యుఘోషతో సాగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజాలోని విషాద పరిస్థితులకు ఈ వీడియో అద్దం పడుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్ కవ్వింపు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

