AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్.. పచ్చిదే పవర్‌ఫుల్ మావ.. ఉల్లిపాయలను ఇలా తింటే బంపర్ బెనిఫిట్స్..

మనం వంటలో ఉల్లిపాయలను ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తాము. అవి వంటకు రుచిని జోడించడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా పనిచేస్తాయి.. సాధారణంగా, వంటలలో వాటిని ఉపయోగించేటప్పుడు, మనం ఉల్లిపాయలను ఉడికించి లేదా వేయించి, ఆ తర్వాత వంటలో వాడతాము. కానీ, ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా? అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

వావ్.. పచ్చిదే పవర్‌ఫుల్ మావ.. ఉల్లిపాయలను ఇలా తింటే బంపర్ బెనిఫిట్స్..
రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar levels): ఉల్లిపాయలకు రక్తంలో చక్కెరను తగ్గించే గుణం ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికే హైపోగ్లైసీమియా (లో-షుగర్)తో బాధపడుతున్నా లేదా ఇన్సులిన్ వాడుతున్నా, పచ్చి ఉల్లిపాయలను అతిగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోవచ్చు.
Shaik Madar Saheb
|

Updated on: Mar 19, 2026 | 6:50 AM

Share

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.. ఎందుకంటే.. ఉల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి.. పచ్చి ఉల్లిపాయలోని యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచి ఎన్నో సమస్యలను నివారిస్తాయి.. అందుకే.. పచ్చి ఉల్లిని మన ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. వాస్తవానికి మనం మన రోజువారీ వంటల్లో ఉల్లిపాయలను ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తాము. అవి మన వంటలకు రుచిని జోడించడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. సాధారణంగా, వంటకాల్లో వాటిని ఉపయోగించేటప్పుడు, మనం వాటిని ఉడికించి లేదా వేయించి, ఆ తర్వాత వంటలో వాడతాము. కానీ, ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

  1. పచ్చి ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్‌ను తగ్గించడానికి ఉల్లిపాయలను ప్రతిరోజూ తినవచ్చు. ఉల్లిపాయలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మంచివి.
  2. పచ్చి ఉల్లిపాయలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కాకుండా, ఇందులో ఫ్లేవనాయిడ్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటుంది.. ఇది కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి..
  3. పచ్చి ఉల్లిపాయలలో ఇతర పోషకాలతో పాటు పీచుపదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. పేగుల ఆరోగ్యానికి అత్యవసరమైన పీచుపదార్థం.. ప్రీబయోటిక్స్‌కు ఉల్లిపాయలు ఒక అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు.
  4. ఉల్లిపాయల్లోని ఔషధ గుణాలు.. జలుబు-దగ్గును తగ్గిస్తాయి.. అలాగే.. చర్మ, కేశ సంరక్షణకు సైతం మేలు చేస్తాయి.
  5. ఉల్లిపాయలు పొట్ట ఆరోగ్యానికి చాలా మంచివి.. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడి.. మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.

ఉల్లిపాయలను ఇలా తినండి..

పచ్చి ఉల్లిపాయలను సలాడ్ అలాగే.. ఆహారంలో జోడించుకోవచ్చు.. ఇంకా.. పెరుగన్నం, మజ్జిగ లాంటి వాటిలో కూడా కలుపుకుని తినవచ్చు.. మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us