ముంబైలోని గోరేగావ్లో 18 నెలల చిన్నారి అరిబా అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఆరో అంతస్తు నుంచి బాలికను విసిరేసిందని అదే భవనంలో నివసించే 10 ఏళ్ల బాలికపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దిందోషి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి తల్లిదండ్రులు దీన్ని హత్యగా భావిస్తున్నారు.