AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. ఇంద్రకీలాద్రిపై సందడి

టాలీవుడ్‌లో క్రేజీ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వస్తుంది.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. ఇంద్రకీలాద్రిపై సందడి
Vijay Devarakonda, Rashmika
Rajeev Rayala
|

Updated on: Oct 17, 2026 | 9:52 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న నటించిన రణబాలి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే థియేటర్లోకి వచ్చిన రణబాలి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. తమ అభిమాన తారలతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు భక్తులు, అభిమానులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. విజయ్, రష్మిక ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను ఒకేచోట చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. ఈ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించడం అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం వీరి కలయికలో వచ్చిన రణబాలి సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us