AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: అప్పుడు మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలోకి యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు అంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను కూడా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహేష్ బాబు చేసిన సినిమాల్లో నాని సినిమా ఒకటి.

Mahesh Babu: అప్పుడు మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలోకి యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా
Maheshbabu
Rajeev Rayala
|

Updated on: Oct 16, 2026 | 6:24 PM

Share

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న కథలను ఎంచుకుంటూ, తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. వాటిలోని పాటలు, సన్నివేశాలు, నటీనటులు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతుంటారు. అలాంటి సినిమాల్లో మహేష్ బాబు నటించిన నాని కూడా ఒకటి. 2004లో విడుదలైన ఈ చిత్రానికి ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించారు. ఇందులో మహేష్ బాబుకు జోడీగా అమీషా పటేల్ నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. దేవయాని, రఘువరన్, నాజర్, సునీల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. కథ, కథనాల పరంగా ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయినా.. మహేష్ బాబు నటన మాత్రం అభిమానులను ఆకట్టుకుంది.

ముఖ్యంగా చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న పెద్దవాడిగా మహేష్ బాబు తన నటనలో చూపించిన వైవిధ్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ చిత్రంలోని పాటలు కూడా సంగీత ప్రియులను అలరించాయి. ముఖ్యంగా పెదవే పలికిన మాటల్లోనే పాట ఇప్పటికీ చాలామందికి ఇష్టమైన మెలోడీగా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా కనిపించిన చిన్న కుర్రాడిని గుర్తుపట్టారా? అప్పట్లో చిన్న పాత్రలో కనిపించిన ఆ బాల నటుడు ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతను మరెవరో కాదు.. మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా.

నాని చిత్రంలో చిన్న పాత్రతో ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ గల్లా.. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు కుటుంబం నుంచి వచ్చిన మరో యువ నటుడిగా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. 2022లో విడుదలైన హీరో సినిమాతో అశోక్ గల్లా కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. చివరిగా ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలో చిన్నపిల్లాడిగా కనిపించిన అశోక్ గల్లా.. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తుండటం అభిమానులకు ఆసక్తికరమైన విషయమే.

View this post on Instagram

A post shared by Galla Ashok (@ashokgalla_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us