AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Anganwadi Centre: హైదరాబాద్‌ మహా నగరంలో తొలి AI అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం

చిన్నారులకు ఆడుతూ పాడుతూ నేర్పించే విధానంలో సాంకేతికతను జోడిస్తూ తొలి AI ఆధారిత అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలోని ఎసామియా బజార్ ప్రాంతంలో ఈ వినూత్న కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారుల ప్రాథమిక విద్యను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కృత్రిమ మేధస్సు..

AI Anganwadi Centre: హైదరాబాద్‌ మహా నగరంలో తొలి AI అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం
AI-powered Anganwadi centre at Hyderabad
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Mar 12, 2026 | 12:33 PM

Share

హైదరాబాద్‌, మార్చి 12: హైదరాబాద్ నగరంలో బాలల విద్యకు సరికొత్త రూపు దిద్దుకుంటోంది. చిన్నారులకు ఆడుతూ పాడుతూ నేర్పించే విధానంలో సాంకేతికతను జోడిస్తూ తొలి AI ఆధారిత అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభమైంది. నగరంలోని ఎసామియా బజార్ ప్రాంతంలో ఈ వినూత్న కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారుల ప్రాథమిక విద్యను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కృత్రిమ మేధస్సు సాంకేతికతను వినియోగించేలా ఈ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ కేంద్రంలో ఇంటరాక్టివ్ డిజిటల్ పరికరాలు, ఆటల రూపంలో బోధన విధానాలు, చిన్నారులకు అనువైన అభ్యాస వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పిల్లలు ఆసక్తిగా నేర్చుకునేలా సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఈ కేంద్రాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు. చిన్నారుల విద్యలో సాంకేతికతను వినియోగించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ఈ విధంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగాత్మక కేంద్రం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా AI ఆధారిత అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. చిన్నారులలో ఆసక్తిని పెంచుతూ, ఆడుతూ పాడుతూ నేర్పించే ఈ విధానం బాలల ప్రాథమిక విద్యకు కొత్త దారులు చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే