AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: CBSE మ్యాథ్స్‌ క్వశ్చన్‌ పేపర్‌ QR కోడ్‌లో యూట్యూబ్‌ హిట్‌ సాంగ్‌.. అవాక్కైన విద్యార్ధులు!

మార్చి 9న జరిగిన 12వ తరగతి మ్యాథమెటిక్స్‌ పరీక్ష నిర్వహించిన కొద్దిసేపటికే ప్రశ్నపత్రం స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు కారణం.. ఈ క్వశ్చన్‌ ముద్రించిన QR కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా యూట్యూబ్‌ సాంగ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో 1987 నాటి రిక్ ఆస్ట్లీ హిట్ సాంగ్..

Viral Video: CBSE మ్యాథ్స్‌ క్వశ్చన్‌ పేపర్‌ QR కోడ్‌లో యూట్యూబ్‌ హిట్‌ సాంగ్‌.. అవాక్కైన విద్యార్ధులు!
CBSE 12th Exam QR Code Scandal
Srilakshmi C
|

Updated on: Mar 11, 2026 | 10:29 AM

Share

న్యూఢిల్లీ, మార్చి 11: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి మ్యాథమెటిక్స్‌ పరీక్షా పత్రం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హల్‌చల్ చేస్తుంది. లక్షలాది మంది విద్యార్ధులు రాసే బోర్డు పరీక్షల క్వశ్చన్‌ పేపర్‌లో జరిగిన వింత ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా సీబీఎస్సీ బోర్డు పరీక్షల అన్ని ప్రశ్నాపత్రాలపై QR కోడ్ ముద్రిస్తారు. సీబీఎస్సీ ప్రశ్నాపత్రాలపై ముద్రించే ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే సెట్ వెరిఫికేషన్, డిజిటల్ భద్రత కోసం ముద్రిస్తారు. అయితే మార్చి 9న జరిగిన 12వ తరగతి మ్యాథమెటిక్స్‌ పరీక్ష నిర్వహించిన కొద్దిసేపటికే ప్రశ్నపత్రం స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు కారణం.. ఈ క్వశ్చన్‌ ముద్రించిన QR కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా యూట్యూబ్‌ సాంగ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో 1987 నాటి రిక్ ఆస్ట్లీ హిట్ సాంగ్ ‘Never Gonna Give You Up’ ప్లే అవ్వడంతో విద్యార్ధులంతా అవాక్కవుతున్నారు. దీంతో విద్యార్థులు స్క్రీన్‌షాట్‌లు తీసి రకరకాల మీమ్స్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు

ఈ వింత ఘటన యూట్యూబ్‌ రిక్రోలింగ్ వల్ల చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది చాలా కాలంగా నడుస్తున్న ఇంటర్నెట్ ట్యాప్‌. రిక్రోలింగ్ చేస్తే తాము చూడాలని ఆశించిన కంటెంట్‌కు బదులుగా వేరే కంటెట్‌ ప్రత్యక్ష్య మవుతుంది. ఈ మీమ్స్‌ తొలుత 2000ల మధ్యలో ఆన్‌లైన్ జోకుల కోసం రూపొందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే CBSE వంటి సీరియస్‌ బోర్డు పరీక్షల్లోనూ ప్రాంక్ వీడియో లింక్ రావడంతో దీన్ని అరుదైన ‘డిజిటల్ మిస్టేక్’గా పరిగణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘సీబీఎస్సీ గణిత ప్రశ్నపత్రంపై యూట్యూబ్ క్యూఆర్ కోడ్‌ను ముద్రించి 25 లక్షల మంది విద్యార్థులను మోసం చేసింది’, ‘నేను చూసిన అత్యుత్తమ రిక్రోల్ ఇదే’, ’12వ తరగతి మ్యాథ్స్ ఎగ్జాం కష్టంగా వచ్చిందని ఏడుస్తున్నమాకు రిలీఫ్‌ కోసం సీబీఎస్సీ కామెడీ ట్విస్ట్ ఇస్తుందని ఊహించలేదు’ అని విద్యార్ధులు మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. అయితే సీబీఎస్సీ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై స్పందించిన సీబీఎస్సీ బహిరంగంగా క్షమాపణలు తెలిపింది. ‘ప్రశ్నపత్రాల భద్రత విషయంలో రాజీపడలేదు. ఇది కేవలం ప్రింటింగ్‌ ఎర్రర్‌ మాత్రమే. ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా బోర్డు అవసరమైన చర్యలు తీసుకుంటోంది’ అని CBSE తెలిపింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us