భారత్ నుంచి నేపాల్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ..
Vande Bharat Express: ఇండియా నుంచి నేపాల్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు అయింది. నవంబర్ 23వ తేదీన భారత ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని కలిసి ఈ రైలును వర్చవల్‌గా ప్రారంభించనున్నారు. అయోధ్య, సీతా మాత జన్మస్థలం మధ్య ఈ రైలు కనెక్టివిటీని అందించనుంది.

సీతా మాత జన్మించిన నేపాల్‌లోని జనక్ పూర్ ప్రదేశానికి వెళ్లడం ఇక మరింత సులువు కానుంది. శ్రీరామచంద్రుడు కొలువైన అయోధ్య నుంచి జనక్ పూర్‌కు సులభంగా చేరుకోవచ్చు. ఇప్పటివరకు అక్కడికి వెళ్లాలంటే విమానాల ద్వారా ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి నేరుగా ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. అది కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వేగవంతంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు ఇండియా నుంచి నేరుగా నేపాల్‌కు వందే భారత్ ట్రైన్ నడిపేందుకు మార్గం సుగమమైంది. నవంబర్ 23వ తేదీన ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఢిల్లీలో పచ్చజెండా ఊపి వర్చువల్ విధానంలో ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు అయింది. దీని ద్వారా అయోధ్య నుంచి సీతా మాత జన్మించిన జనక్‌పూర్‌తో పాటు అక్కడి పర్యాటక ప్రదేశాలకు సులువుగా చేరుకోవచ్చు.
నవంబర్ 23 నుంచి ప్రారంభం
భారతీయులు ఈ రైలు ద్వారా సీతా మాత జన్మస్థలంతో పాటు చుట్టుపక్కల ఉండే దేవాలయాలను సందర్శించుకోవచ్చు. అలాగే నేపాల్ నుంచి భక్తులు అయోధ్యకు సౌకర్యవంతంగా చేరుకోవచ్చు. మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం, భారత్, నేపాల్ మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించేందుకు ఈ రైలు ఉపయోగపడనుంది. ఈ వందే భారత్ రైలు నవంబర్ 23న అయోధ్య నుంచి ప్రారంభమై నేపాల్‌కు చేరుకోనుంది. ఈ రైలుకు పది స్టాపులు ఉంటాయి. మొత్తం 604 కిలోమీటర్ల మేర దూరాన్ని ఇవి కవర్ చేయనుండగా.. వారానికి ఒక రోజు అందుబాటులో ఉంటుంది. బీహార్, యూపీలోని అనేక ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. అయోధ్య నుంచి ప్రతీ సోమవారం, తిరుగు ప్రయాణంలో జనక్‌పూర్ థామ్ నుంచి ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది.
ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..?
జయనగర్, మధుబని, శిషో, సీతామర్హి, రక్సాల్, నర్కటియాగంజ్, గోరఖ్‌పూర్, బస్తీ. మాన్కాపూర్, అయోధ్య ధామ్ స్టేషన్లో ఇది ఆగనుంది. నేపాల్ ప్రధాని బలేంద్ర షా కూడా ఈ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నార. భారత్, నేపాల్ మధ్య శతాబ్దాలకాలంగా సాంస్కృతిక, సామాజిక, చారిత్రాక సంబంధాుల కొనసాగుతున్నాయి. ఈ రైలు వల్ల భారత్, నేపాల్ మధ్య అనుసంధానాన్ని కలిగించడమే కాకుండా సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అలాగే మార్గం మధ్యలోనే అనేక ప్రాంతాల మధ్య అనుసంధానం కలిగించనుంది. దీని వల్ల వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చనుంది. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన తల్లి మృతి కారణంగా హాజరుకావడంపై అనిశ్చితి నెలకొంది. కాగా ప్రయాణికులకు మెరుగైన రైలు అనుసంధానాన్ని అందించడం, ప్రాంతీయ పర్యాటకాన్ని, ఆర్థిక కార్యకలాపాలను, భారత్-నేపాల్ స్నేహపూర్వక సంబంధాలను ప్రోత్సహించడం ఈ రైలు లక్ష్యంగా చెప్పవచ్చు.
