AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Exams 2026: ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌.. అందరూ డీబార్‌!

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాలకు కలిపి 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులు..

Inter Exams 2026: ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌.. అందరూ డీబార్‌!
Inter Students Booked For Malpractice
Srilakshmi C
|

Updated on: Mar 05, 2026 | 12:39 PM

Share

హైదరాబాద్‌, మార్చి 5: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాలకు కలిపి 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులు 4,89,126 మంది, సెకండ్ ఇయర్‌ విద్యార్ధులు 5,07,949 మంది వరకు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,495 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే పరీక్షల నిర్వహనలో ఎలాంటి అవతవకలు జరగకూడదని ఇంటర్ బోర్డు సీసీ కెమెరాలతోసహా పలు ఏర్పాట్లు చేసినప్పటికీ కొందరు విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారు.

బుధవారం (మార్చి 4) జరిగిన ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షల్లో ఒక్కరోజే పలు ప్రాంతాల్లో 13 మంది మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. హనుమకొండ జిల్లాలో 10 మంది, వరంగల్‌ జిల్లాలో మరో ముగ్గురు విద్యార్థులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా అధికారులకు పట్టుబడ్డారు. వీరందరినీ డిబార్‌ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన తర్వాత ఇంత ఎక్కువ మంది పట్టుబడటం ఇదే తొలిసారని తెలిపారు.

ఖానాపురం మండల కేంద్రంలోని జూనియర్‌ కాలేజీలో జరిగిన ఇంటర్‌ పరీక్షల్లో మరో ముగ్గురు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌ చేస్తూ డీబార్‌ అయినట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ బుధవారం తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సదానందం, ప్రకాశ్‌రాజ్‌ సెంటర్‌లో తనిఖీ చేస్తున్న సమయంలో ముగ్గురు విద్యార్థుల వద్ద చిట్టీలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ ముగ్గురిని అధికారులకు అప్పగించినట్లు రవికుమార్‌ తెలిపారు. ఇందులో ఇద్దరు మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు, ఒకరు స్థానికంగా ఉన్న జూనియర్ కాలేజీకి చెందిన వారిగా గుర్తించారు. మొత్తంగా నిన్న జరిగిన పరీక్షలో 16 మంది మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. కాగా బుధవారం జరిగిన పరీక్షకు 97.24 శాతం విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌
తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!
తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!
లబ్ధి దారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ
లబ్ధి దారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ
ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
అందాన్నిపెంచే మటన్ బుడం దోసకాయ కూర.. ఇలా చేస్తే లాగిస్తూనే ఉంటారు
అందాన్నిపెంచే మటన్ బుడం దోసకాయ కూర.. ఇలా చేస్తే లాగిస్తూనే ఉంటారు
వాడ్ని నమ్మి ఎలా వచ్చావమ్మా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
వాడ్ని నమ్మి ఎలా వచ్చావమ్మా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది
జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది
ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్., త్వరలోనే మారనున్న నిబంధనలు
ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్., త్వరలోనే మారనున్న నిబంధనలు