AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌కు గోల్డెన్ టైమ్.. వరుస హిట్లతో జోష్‌లో బాక్సాఫీస్, ఇక నెక్స్ట్ టార్గెట్ ఇదే

టాలీవుడ్‌కు గోల్డెన్ టైమ్.. వరుస హిట్లతో జోష్‌లో బాక్సాఫీస్, ఇక నెక్స్ట్ టార్గెట్ ఇదే

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 28, 2026 | 7:30 PM

Share

టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సెకండాఫ్‌లో గోల్డెన్ రన్ కొనసాగుతోంది. ‘పెద్ది’తో మొదలైన విజయ పరంపరను ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ కొనసాగించాయి. వరుసగా సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక ‘శ్రీనివాస మంగాపురం’, ‘కొరియన్ కనకరాజు’, ‘ఇరుముడి’, ‘టాక్సిక్’ కూడా ఇదే జోరు కొనసాగిస్తాయా అన్న ఆసక్తి నెలకొంది.

నీ టైమ్ నడుస్తుందిరా.. నడిపించు అంటారు కదా..? ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి సీనే కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో మొత్తం కలిపితే కనీసం 3 బ్లాక్‌బస్టర్స్ కూడా రాలేదు.. కానీ సెకండాఫ్ మొదలైనప్పట్నుంచీ ఏదో గుడ్ టైమ్ కనబడుతుంది. పెద్దా చిన్నా తేడా లేకుండా వచ్చిన సినిమా వచ్చినట్లు బాగానే ఆడుతుంది. మరి ఇదే జోరు నెక్ట్స్ కూడా కంటిన్యూ అవుతుందా..? గత నెల రోజులుగా బాక్సాఫీస్ దగ్గర మంచి టైమ్ నడుస్తుంది. కొన్ని రోజులుగా వచ్చిన సినిమా వచ్చినట్లు మంచి వసూళ్లు రాబడుతుంది. తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ కూడా బాగానే ఆడుతుంది. ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ సినిమా 25 కోట్ల గ్రాస్ టచ్ చేస్తుంది. చూస్తుంటే ఈ ప్రేమకథకు ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారనిపిస్తుంది. దీనికి ముందు లెనిన్ కూడా బాగా ఆడింది. అఖిల్ పదేళ్ల నిరీక్షణకు తెర దించుతూ మంచి విజయాన్ని అందించింది లెనిన్. బయ్యర్లకు దాదాపు 15 కోట్లకు పైగానే లాభాలు తెచ్చిపెట్టింది లెనిన్. అన్నపూర్ణ స్టూడియోస్, సితార సంయుక్తంగా నిర్మించిన లెనిన్ ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. ఇక లెనిన్ కంటే ముందే జూన్‌లోనే మా ఇంటి బంగారం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మూడేళ్ళ బ్రేక్ తర్వాత సమంత నటించిన మా ఇంటి బంగారం ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది. సింగ్ గీతం సినిమాకు కూడా ప్రశంసలు వచ్చాయి. ఇదంతా రామ్ చరణ్ పెద్ది దగ్గర మొదలైంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం దాదాపు 400 కోట్లు వసూలు చేసింది. తెలుగులో మంచి లాభాలనే తీసుకొచ్చాడు పెద్ది. ఆ తర్వాత వచ్చిన ప్రతీ సినిమా బాగానే ఆడుతుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ గుడ్ టైమ్ నెక్ట్స్ రాబోయే సినిమాలకు కలిసొస్తుందనే నమ్ముతున్నారు మేకర్స్. జూలై 30న శ్రీనివాస మంగాపురం, ఆగస్ట్ 7న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, 21న రవితేజ ఇరుముడి, 26న యశ్ టాక్సిక్ విడుదల కానున్నాయి. ఇవన్నీ కూడా బాగా ఆడాయంటే సెకండాఫ్‌కు మంచి పునాది పడ్డట్లే. మరి చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..

Follow Us