తిరువణ్ణామలైలోని మోక్ష మార్గంలో ఇటీవల ఓ ఏపీ మహిళ ఇరుక్కుపోగా, భక్తులు చాకచక్యంగా రక్షించారు. అయితే, ఇదే మార్గంలో మూడు రోజుల క్రితం రాజమండ్రికి చెందిన మణికుమార్ మరణించడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. మోక్ష మార్గంలోకి ప్రవేశంపై కొత్త నిబంధనలు, సమయ పరిమితులు విధించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.