AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dosa Avakaya: పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ.. కంచాలు కంచాలు ఆరగించేస్తారు!

Dosa Avakaya Pickle Recipe: తెలుగువారి సాంప్రదాయ పిండివంటలు, పచ్చళ్లలో ఆవకాయకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. మామిడికాయ ఆవకాయ ఎంత ప్రసిద్ధమో, నాటు దోసకాయతో చేసే దోస ఆవకాయ కూడా అంతే ఇష్టంగా తింటారు. ఏ వేడుకైనా, శుభకార్యమైనా విందు విస్తరిలో దోస ఆవకాయ పడితే ఆ భోజనం పూర్తి స్థాయిలో తృప్తినిస్తుంది.

Phani CH
|

Updated on: Jul 28, 2026 | 9:05 PM

Share
వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చి నూనె లేదా నెయ్యి వేసుకుని, ఘాటైన ఈ దోస ఆవకాయ కలుపుకుని తింటుంటే నాలుకకు అద్భుతమైన రుచి లభిస్తుంది. సరైన పక్కా కొలతలతో పచ్చడి పెడితే ఇది మూడు నుండి నాలుగు నెలల పాటు పక్కాగా నిల్వ ఉంటుంది. ఈ దోస ఆవకాయ తయారీ కోసం ముఖ్యంగా కీర దోసకాయ కాకుండా గట్టిగా, పుల్లగా ఉండే నాటు దోసకాయలను ఎంచుకోవాలి.

1 / 5
సుమారు 400 గ్రాముల దోసకాయను తీసుకుని శుభ్రంగా కడిగి, తేమ లేకుండా పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఆ తర్వాత కాయలోని గింజలను తొలగించి, చేదు ఉందో లేదో సరిచూసుకుని చిన్న చిన్న సమాన పరిమాణపు ముక్కలుగా కోసుకోవాలి. తడి లేకుండా చూసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది.

2 / 5
ఇప్పుడు ఒక గిన్నెలో పొడి చేసిన ఆవపిండి 70 గ్రాములు, రుచికి తగినంత ఉప్పు, అలాగే 70 గ్రాముల కారం మరియు పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పొడుల మిశ్రమంలో కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కారం కొలుచుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు (సుమారు 160 గ్రాములు) వేరుశెనగ పచ్చి నూనెను అందులో పోయాలి.

3 / 5
వేడి చేయని పచ్చి నూనె వాడటం వల్ల పచ్చడికి అసలైన సాంప్రదాయ ఆవకాయ రుచి వస్తుంది. ఒకవేళ దోసకాయ పులుపు తక్కువగా ఉంటే ఆఖరున రెండు స్పూన్ల నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కనీసం 5 నుండి 6 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి.

4 / 5
మరుసటి రోజుకి దోసకాయ ముక్కలు ఊరి, నూనె పైకి తేలి నోరూరించే ఆవకాయ సిద్ధమవుతుంది. వేడి అన్నంలోకి, చివరికి గడ్డ పెరుగుతో నంజుకుని తిన్నా ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ పక్కా కొలతలతో ఇంట్లో దోస ఆవకాయ ప్రయత్నించి చూడండి.

5 / 5
Follow Us
నవంబర్ 13న డూమ్స్‌డే? 66 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల లెక్కలు వైరల్

దీపావళి వేడుకల్లో దిల్ రాజు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో..

క్షణాల్లో 50 వాహనాలు ఢీ! వాహనాల కుప్పలు..బల్గేరియాలో 11 మంది మృతి

అక్షరధామ్‌లో కన్నులపండువగా అన్నకూట్.. స్వామివారికి ఏకంగా..

బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల..

ఖురాన్, బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం

మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..

అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?

ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..

ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?