తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ పేరుతో కొత్త ఎలక్ట్రానిక్ కుటుంబ ధృవీకరణ పత్రాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబ ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడమే దీని లక్ష్యం. మీసేవా ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ ఆధారంగా ఈ సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఇది కేవలం ప్రభుత్వ పథకాలకు మాత్రమే వర్తిస్తుంది, ఆస్తి వివాదాలకు కాదు.