19 ఏళ్ల వయసులో నేను చేసిన ఆ పనికి.. నాన్న కోప్పడ్డారు..
28-07-2026
Pic credit - Instagram
Phani Ch
నటి శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ తన 19 ఏళ్ల వయసులో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
తాను తీసుకున్న ఒక తిరుగుబాటు నిర్ణయానికి నాన్న కమల్ హాసన్ ఎంతగానో కోప్పడ్డారని తెలిపారు!
ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనిథింగ్' సెషన్‌లో తన టీనేజ్ రోజులకు సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
ఈ ఛాట్ సెషన్‌లో ఒక నెటిజన్ శ్రుతిని ఉద్దేశించి "మీకు బొడ్డుకు పియర్సింగ్ ఉందా? ఉంటే ఎప్పుడు చేయించుకున్నారు?" అని ప్రశ్నించారు.
తాను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బొడ్డుకు పియర్సింగ్ చేయించుకున్నానని శ్రుతి తెలిపారు. ఆ వయసులో తనకు ఉన్న తిరుగుబాటు మనస్తత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అయితే శ్రుతి హాసన్ బొడ్డు పియర్సింగ్ చేయించుకున్న విషయం తెలిసి కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, తనపై బాగా కోప్పడ్డారని శ్రుతి అప్పటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు.
చిన్నతనంలో తాను చేసిన ఈ చిన్ననాటి పెంకితనం వల్ల నాన్న తీవ్ర అసంతృప్తి చెందారని, అది తన లైఫ్‌లో ఒక మరచిపోలేని సంఘటన అని శ్రుతి తెలిపారు.