సముద్ర ఆహారాలు (సీ ఫుడ్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరూ అనుకుంటారు. కానీ వీటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పేనట
TV9 Telugu
ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పర్‌స్పెక్టివ్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కొన్ని రకాల సముద్ర ఆహారాల్లో మిథైల్ మెర్క్యురీతోపాటు పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఉంటాయి
TV9 Telugu
ఇవి అధిక మోతాదులో శరీరంలో చేరితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు
TV9 Telugu
మిథైల్ మెర్క్యురీతోపాటు సీసం (లెడ్), మాంగనీస్, క్రోమియం, క్యాడ్మియం, ఆర్సెనిక్ వంటి లోహాల ఆనవాళ్లు కూడా కొన్ని సముద్ర ఆహారాల్లో కనిపిస్తాయి
TV9 Telugu
ఇవి ఎక్కువ కాలం శరీరంలో పేరుకుపోతే ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. మెర్క్యురీకి రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది
TV9 Telugu
ముఖ్యంగా మహిళల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి
TV9 Telugu
ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో శరీర రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణాలపైనే దాడి చేయడం ప్రారంభిస్తుంది
TV9 Telugu
దీని వల్ల ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, లూపస్, షోగ్రెన్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది