AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC Admit Card 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ CBT 1 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

ర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ CBT 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు ఈ వారంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) విడుదల చేయనుంది. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేసిన ఆర్‌ఆర్‌బీ మరో 2 రోజుల్లో అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో..

RRB NTPC Admit Card 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ CBT 1 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
RRB NTPC Admit Card
Srilakshmi C
|

Updated on: Mar 11, 2026 | 6:31 AM

Share

హైదరాబాద్‌, మార్చి 11: దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ CBT 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు ఈ వారంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) విడుదల చేయనుంది. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేసిన ఆర్‌ఆర్‌బీ మరో 2 రోజుల్లో అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. మార్చి 16 నుంచి మార్చి 27వ తేదీ వరకు ఈ పరీక్షలు రోజుకు మూడు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటలకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 12.45 గంటలకు, మూడవ షిఫ్ట్ సాయంత్రం 4.30 గంటలకు మొదలవుతుంది. మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు చొప్పున కోత విధిస్తారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంటన్నర ముందుగానే సంబంధిత కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది.

అభ్యర్ధులందరికీ ఒకే సారి అడ్మిట్‌ కార్డులు విడుదల చేయమని, పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందుగా మాదే అడ్మిట్ కార్డులు విడివిడిగా జారీ చేస్తామని ఆర్‌ఆర్‌బీ తెలిపింది. అంటే మార్చి 16 తేదీన పరీక్ష ఉన్న అభ్యర్థులు మార్చి 13 నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నమాట. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్ నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌ కార్డుతోపాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తమతోపాటు అభ్యర్ధులు తప్పనిసరిగా తీసుకురావల్సి ఉంటుంది. ఈ మేరకు అభ్యర్ధులంతా పరీక్షలకు సంబంధించిన ఇతర సూచనలను అడ్మిట్ కార్డు విడుదలైన తర్వాత అందులోని మార్గదర్శకాల ఆధారంగా పాటించాలని బోర్డు సూచించింది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ CBT 1 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆరుగురు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చిన ఆముదం గింజలు!
ఆరుగురు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చిన ఆముదం గింజలు!
పాక్‎తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కలిసొచ్చే అంశాలివే
పాక్‎తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కలిసొచ్చే అంశాలివే
బజాజ్ సరికొత్త స్పోర్ట్స్ బైక్ "పల్సర్ RS200" వచ్చేసింది..!
బజాజ్ సరికొత్త స్పోర్ట్స్ బైక్
వాళ్లకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు: కీర్తిసురేష్
వాళ్లకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు: కీర్తిసురేష్
భారత్ నుంచి నేపాల్‌కు వందే భారత్ ట్రైన్.. ముహూర్తం ఫిక్స్..
భారత్ నుంచి నేపాల్‌కు వందే భారత్ ట్రైన్.. ముహూర్తం ఫిక్స్..
జడ్జికి బదులు ఒవైసీకి సెల్యూట్..పోలీసుల ప్రోటోకాల్ మిస్టేక్!
జడ్జికి బదులు ఒవైసీకి సెల్యూట్..పోలీసుల ప్రోటోకాల్ మిస్టేక్!
వాహనాలు ఆపి డబ్బులు వసూలు.. చివరకు అడ్డంగా బుక్కయ్యారు!
వాహనాలు ఆపి డబ్బులు వసూలు.. చివరకు అడ్డంగా బుక్కయ్యారు!
మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈరోజే ఇది చదవండి.. !
మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈరోజే ఇది చదవండి.. !
ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానంటూ లోబర్చుకున్నాడు.. చివరకు
ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానంటూ లోబర్చుకున్నాడు.. చివరకు
కప్పు బియ్యంతో ఇలా చేస్తే.. ఒక్క రాత్రిలోనే కాళ్ల పగుళ్లు మాయం!
కప్పు బియ్యంతో ఇలా చేస్తే.. ఒక్క రాత్రిలోనే కాళ్ల పగుళ్లు మాయం!