AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బ్యాంక్ లాకర్లలో బంగారం దాచుకుంటున్నారా..? ఈ చిన్న తప్పు చేస్తే భారీగా నష్టం..

ఇంట్లో బంగారం దాచుకుంటే దొంగల భయం ఉంటుంది. దీంతో చోరీకి గురవుతుందనే భయంతో చాలామంది బ్యాంక్ లాకర్లలో బంగారాన్ని దాచుకుంటారు. అయితే బ్యాంక్ లాకర్లలోని బంగారానికి ఏదైనా నష్టం జరిగితే ఎంత పరిహారం అవస్తుందనే విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎంత పరిహారం వస్తుంది? బంగారానికి బీమా చేయించుకోవాల్సిన అవసరం ఉందా? అనేది తెలుసుకుందాం.

Gold: బ్యాంక్ లాకర్లలో బంగారం దాచుకుంటున్నారా..? ఈ చిన్న తప్పు చేస్తే భారీగా నష్టం..
Gold Insurance
Venkatrao Lella
|

Updated on: Nov 28, 2026 | 11:37 AM

Share

బ్యాంకు లాకర్లలో చాలామంది బంగారాన్ని దాచుకుంటూ ఉంటారు. ఇందుకోసం లాకర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఒకసారి వార్షిక లాకర్ ఛార్జీలు ఉంటాయి. అయితే ఒకవేళ లాకర్‌లో ఉన్న మీ బంగారం బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల చోరీకి గురైనా లేదా నష్టం జరిగినా వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు ఎక్కువ పరిహారం అందిస్తారు. ఉదాహరణకు మీరు రూ.50 లక్షల విలువ చేసే బంగారం దాచుకుంటే కేవలం రూ.3 లక్షలు మాత్రమే అందుతుంది. బ్యాంక్ ఉద్యోగి మోసం, అగ్నిప్రమాదం, బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాలకు ఇది వర్తిస్తుంది. కానీ భూకంపం లేదా వినియోగదారుడు వల్ల నష్టం జరిగితే ఈ పరిధిలోకి రాదు. దీంతో మీ లాకర్లలోని బంగారానికి భద్రత ఉండాలంటే ప్రత్యేక బీమా పాలసీని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

బీమా పాలసీ తీసుకుంటున్నారా..?

అయితే మీ బంగారానికి బీమా తీసుకునేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీరు బీమా తీసుకునేముందు పాలసీ పత్రాలను క్షుణ్నంగా సరిచూసుకోవడం మంచిది. రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కవరేజీకి వస్తువుల వారీగా జాబితా అవసరం. మొత్తం రూ. 40 లక్షలు దాటితే లేదా ఒక్కో వస్తువు విలువ రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే వాల్యుయేషన్ రిపోర్ట్ అవసరం పడుతుంది. పాలసీ లాకర్‌లో జరిగే దొంగతనానికి ఇది వర్తిస్తుంది. కానీ వివరించలేని అదృశ్యానికి వర్తించదు. మీరు పెళ్లికి నెక్లెస్ తీసుకువెళ్లి.. ఇంటికి తిరిగి వచ్చే దారిలో ఎవరైనా దాన్ని దొంగిలిస్తే.. లాకర్ పాలసీ ఆ నష్టాన్ని కవర్ చేయదు.

ఇవి చెక్ చేసుకోండి..

రూ.40 లక్షల విలువైన బంగారాన్నికి వాల్యుయేషన్ రిపోర్ట్ అందించాల్సి ఉంటుంది. కొనుగోలు బిల్లులు, హాల్‌మార్క్ సర్టిఫికేట్లు, లాకర్‌లో ఉన్న వస్తువుల ఫోటోలను భద్రపరచండి. లాకర్‌లోని వస్తువులకు రుజువు లేకుండా క్లెయిమ్ చేయడం కష్టమవుతుంది. పాలసీ కింద ఏవి కవర్ చేయబడలేదో చదవండి. అంతుచిక్కని అదృశ్యం వల్ల కలిగే నష్టాలు, లేదా ప్రకటించని వస్తువులు సాధారణ వివాదాలుగా ఉంటాయి. మనం కారుకు, ఫోన్‌కు, ఇంటికి, మన ప్రాణాలకే బీమా చేయిస్తాము. కానీ అత్యంత విలువైన ఆస్తిగా పరిగణించే బంగారానికి బీమా చేయించం. దీని వల్ల బంగారానికి ఏదైనా జరిగితే భారీగా డబ్బు కోల్పోవాల్సి ఉంటుంది. బ్యాంక్ లాకర్లలోని బంగారానికి నష్టం జరిగితే మీ బంగారం విలువ ఎంత అయితే ఉందో.. అంత పరిహారం లభించదు. వార్షిక అద్దెకు 100 రెట్లు మాత్రమే అందుతుంది. బ్యాంక్ లాకర్ల వార్షిక అద్దె అనేది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. దీంతో మీరు బ్యాంకు లాకర్లలో బంగారం దాచుకుంటుంటే బీమా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us