AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMart Shopping Tips: డీమార్ట్‌లో షాపింగ్‌కు వెళ్తున్నారా..? అందరూ చేసే తప్పు ఇదే.. ఇదొక్కటి తప్పించుకోండి..

డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల చాలామంది అనవసర వస్తువులు కొనుగోలు చేసి భారీ బిల్లు చెల్లిస్తున్నారు. డబ్బు ఆదా చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. ఆఫర్లకు ఆకర్షితులు కాకుండా,బడ్జెట్‌కు అనుగుణంగా కొనుగోలు చేయడం వల్ల డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

DMart Shopping Tips: డీమార్ట్‌లో షాపింగ్‌కు వెళ్తున్నారా..? అందరూ చేసే తప్పు ఇదే.. ఇదొక్కటి తప్పించుకోండి..
Dmart Shopping Tips
Venkatrao Lella
|

Updated on: Nov 28, 2026 | 9:03 AM

Share

డీమార్ట్ స్టోర్‌లు ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు మెట్రో సిటీలు, పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ  స్టోర్లు ఇప్పుడు సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా వెలుస్తున్నాయి. తక్కువ ధరలు, రెగ్యులర్ ఆఫర్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితం వంటి ఆకర్షణీయమైన డీల్స్‌తో డీమార్ట్‌ను అపారమైన ప్రజాదరణకు సొంతం చేసుకుంటున్నాయి. ఇంటికి అవసరమైన దాదాపు అన్ని వస్తువులు ఒకేచోట లభించడంతో.. చాలా కుటుంబాలు తమ నెలవారీ సరుకుల కోసం ఇక్కడికి వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే  ఆఫర్ల ఉచ్చులో పడి చాలామంది అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేసి తమ ఇంటి బడ్జెట్ పెంచుకుంటున్నారు. షాపింగ్ సమయంలో సరైన ప్రణాళిక లేకపోవడం, ఆకర్షణీయమైన డిస్‌ప్లేలకు లొంగిపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అనవసర ఖర్చులను తగ్గించుకొని డబ్బులు పొదుపు చేసుకోవాలంటే ఒక ప్రణాళికలను అనుసరించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే డబ్బులు ఆదా

డీమార్ట్‌కు వెళ్లేటప్పుడు ముందుగా ఇంటికి అవసరమైన సరుకుల జాబితాను తయారు చేసుకోవాలి. బియ్యం, పప్పులు, నూనె, రోజువారీ వినియోగ వస్తువులైన సబ్బులు, డిటర్జెంట్లు వంటివి మాత్రమే ఈ జాబితాలో ఉండాలి. జాబితా ప్రకారం షాపింగ్ చేయడం వల్ల అనవసర కొనుగోళ్లను తగ్గించుకోవచ్చు. డీమార్ట్‌లోకి వెళ్ళినప్పుడు, ఆకర్షణీయమైన ఆఫర్లకు చాలామంది ఆకర్షితులవుతారు. దీని వల్ల అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డీమార్ట్‌లో ప్రవేశించిన వెంటనే బిస్కెట్లు, చాక్లెట్లు, స్నాక్స్ వంటి తినుబండారాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. ఇవి తక్కువ ధరకు లభించడం వల్ల వెంటనే తీసుకోవాలనిపిస్తుంది. అయితే షాపింగ్ ప్రారంభంలోనే వీటిని కొనకుండా ఉండటం మంచిది. ముందుగా తప్పనిసరి అవసరాలైన కిరాణా సరుకులు కొనుగోలు చేయాలి. ఈ రకమైన తినుబండారాలు నిజంగా అవసరమైతే షాపింగ్ చివర్లో మాత్రమే తీసుకోవాలి. ముందుగానే వీటిని కొనుగోలు చేయడం వల్ల ప్రధాన కొనుగోళ్లపై దృష్టి మళ్లీ ఖర్చు పెరుగుతుంది. డీమార్ట్‌లో దుస్తులు, కిచెన్ వేర్, ప్లాస్టిక్ వస్తువులు వంటి అనేక విభాగాలు కూడా ఉంటాయి. ఇవి కూడా తక్కువ ధరలలో లభించడంతో చాలామందికి అవసరం లేకున్నా కొంటారు. నిజంగా అవసరం ఉన్నప్పుడే ఇలాంటివాటి వైపు దృష్టి మళ్లించడం మంచిది.

ఇతర కంపెనీల బ్రాండ్ వస్తువుల కంటే డీమార్ట్ సొంత బ్రాండ్ ఉత్పత్తులను కొనుగోలు చేయండి.  ఇతర బ్రాండ్లతో పోలిస్తే ఇవి తక్కువ ధరలో లభిస్తాయి.  వీటిని ఎంచుకోవడం ద్వారా కొంతవరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు కేవలం ఆఫర్లకు ఆకర్షితులు కాకుండా.. నిజమైన అవసరాల ఆధారంగా కొనుగోలు చేస్తేనే డబ్బులు పొదుపు అవుతాయి. సరైన ప్రణాళిక, నియంత్రణ, షాపింగ్ జాబితా ముందుగానే సిద్దం చేసుకోవడం వల్ల డీమార్ట్ షాపింగ్ సమయంలో భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

Follow Us