AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సింగర్ కమ్ డ్యాన్సర్.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

సాధారణంగా సినీ రంగుల ప్రపంచంలో ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకున్న కొందరు హీరోయిన్స్.. అంతే త్వరగా సినిమాలకు దూరమైపోతుంటారు. తర్వాత ఫ్యామిలీ లైఫ్ గడుపుతూ బయట పెద్దగా కనిపించరు. ఇప్పుడు కూడా అలానే టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన ఓ బ్యూటీ కనిపించింది. ఆమె టాలెంట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

Tollywood : ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సింగర్ కమ్ డ్యాన్సర్.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
Saranya Mohan
Rajitha Chanti
|

Updated on: Nov 28, 2026 | 11:50 AM

Share

దక్షిణాది సినిమాల్లో తన సహజమైన నటన, ఆకట్టుకునే హావభావాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో శరణ్య మోహన్ ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ కథానాయికగా తనదైన ముద్ర వేశారు. గ్లామర్ రూల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల గురువాయూర్ ఉత్సవం సందర్భంగా ఆమె భక్తి గీతాలు ఆలపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో, ఆమెలోని బహుముఖ ప్రతిభపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం వెండితెర నటిగానే కాకుండా, శాస్త్రీయ నృత్యం, సంగీతంపై శరణ్య మోహన్‌కు మంచి పట్టు ఉంది. గురువాయూర్ వేదికపై ఆమె భక్తి భావంతో పాడిన గీతాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. నటనతో పాటు పాడటం, నృత్యం చేయడం వంటి కళల్లో ఆమెకున్న నైపుణ్యం ఈ వీడియో ద్వారా మరోసారి స్పష్టమైందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

వివిధ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన శరణ్య మోహన్, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ముఖ్యంగా తన పాత్రల ఎంపిక, సంప్రదాయబద్ధమైన అభినయంతో విభిన్నమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాలకు కొంత విరామం తీసుకున్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా తన కళాత్మక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన భీమిలీ చిత్రంలో నటించింది. అలాగే కత్తి సినిమాలో కళ్యాణ్ రామ్ చెల్లిగా కనిపించింది. కెరీర్ ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైన ఆమె.. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయించింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

2014 వరకు సినిమాల్లో నటించిన శరణ్య మోహన్.. 2015లో తన చిన్నప్పటి ఫ్రెండ్ అరవింద్ కృష్ణన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ అ‍బ్బాయి, అమ్మాయి ఉన్నారు. ప్రస్తుతం శరణ్య నాట్య శిక్షణ మండలి స్థాపించి ఎంతో మందికి నాట్యం నేర్పిస్తుంది. గురువాయూర్ వేడుకలో శరణ్య మోహన్ పాడిన భక్తి గీతాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఆన్‌లైన్‌లో వేగంగా షేర్ అవుతున్నాయి. భక్తిరస గీతాలను ఆమె ఆలపించిన తీరు ఎంతో హాయిగా, ఆధ్యాత్మికంగా ఉందంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. తెరపై నటిగా అలరించిన శరణ్య, ఇప్పుడు తన గాత్రంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషంగా నిలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

శరణ్య పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Follow Us
నాని, కళ్యాణ్ రామ్‏తో సినిమాలు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్..
నాని, కళ్యాణ్ రామ్‏తో సినిమాలు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్..
తెలంగాణలో ఇండస్ట్రియల్ పాలసీ 2.0.. తయారీ రంగానికి కొత్త దశ
తెలంగాణలో ఇండస్ట్రియల్ పాలసీ 2.0.. తయారీ రంగానికి కొత్త దశ
IPL 2027 Captains: 7 జట్ల కెప్టెన్లు ఫిక్స్.. 3 జట్లకు ఎవరంటే?
IPL 2027 Captains: 7 జట్ల కెప్టెన్లు ఫిక్స్.. 3 జట్లకు ఎవరంటే?
కార్తిక దీపం రూపంలో మృత్యువు.. చిన్న నిర్లక్ష్యం 18 ఏళ్ల యువతి
కార్తిక దీపం రూపంలో మృత్యువు.. చిన్న నిర్లక్ష్యం 18 ఏళ్ల యువతి
బ్యాంక్ లాకర్లలో బంగారం దాచుకునేవారు ఈ విషయం మర్చిపోవద్దు..
బ్యాంక్ లాకర్లలో బంగారం దాచుకునేవారు ఈ విషయం మర్చిపోవద్దు..
తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. విదేశాల్లో ఉద్యోగం వస్తే..
తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. విదేశాల్లో ఉద్యోగం వస్తే..
మీరు ఏ గదిని ఎంచుకుంటారు? ఈ పర్సనాలిటీ టెస్ట్ మీ అసలు స్వభావాన్ని
మీరు ఏ గదిని ఎంచుకుంటారు? ఈ పర్సనాలిటీ టెస్ట్ మీ అసలు స్వభావాన్ని
అట్టర్ ప్లాప్ సినిమా అన్నారు.. అతడు చెప్పిన ఆ ఒక్క మాటకు షాకయ్యా.
అట్టర్ ప్లాప్ సినిమా అన్నారు.. అతడు చెప్పిన ఆ ఒక్క మాటకు షాకయ్యా.
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..
తెలంగాణలో 2029లోనే ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌
తెలంగాణలో 2029లోనే ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌