AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. రైతులకు సీఎం రేవంత్ కీలక సూచనలు!

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని.. ప్రజలందరూ నీటిని జాగ్రత్తగా వాడాలని, ప్రభుత్వం చేపడుతున్న వాతావరణ మార్పుల నిరోధక చర్యలలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రైతులు తక్కువ నీటి పంటలవైపు మొగ్గు చూపాలని కోరారు.

CM Revanth Reddy: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. రైతులకు సీఎం రేవంత్ కీలక సూచనలు!
Cm Revanth Reddy Warns Of Water Scarcity
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Nov 28, 2026 | 12:07 PM

Share

తెలంగాణలో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను అప్రమత్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని, వచ్చే ఎనిమిది నెలల పాటు వర్షాలు లేకపోవచ్చని అంచనా వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక్కటే కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన క్లైమేట్ కాన్‌క్లేవ్‌–గ్లోబల్ సమిట్ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్‌లో సీఎం ఈ కామెంట్స్ చేశారు.

ఎల్‌నినో ప్రభావం తెలంగాణకే పరిమితం కాదని, ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఈ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని సీఎం పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారిలాగే వాతావరణ మార్పులు కూడా ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారాయని అన్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కేవలం రెండు గంటల్లోనే 24 సెంటీమీటర్ల వరకు కురిసే సందర్భాలు ఉన్నాయని, నగర మౌలిక సదుపాయాల రూపకల్పన మాత్రం రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని జరిగిందని వివరించారు. దీంతో ఆకస్మిక భారీ వర్షాలు, క్లౌడ్‌బరస్ట్‌ల సమయంలో వరదలు సంభవించి కాలనీలు నీటమునిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు.

రైతులు కూడా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రానికి ప్రధాన సమస్య ఆహార ధాన్యాల కొరత కాదని, నీటి కొరతేనని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు రాష్ట్రంలో అందుబాటులో ఉంటాయని, గతంలో కరవు సమయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్ల అవసరం ఇప్పుడు ఉండదని భరోసా ఇచ్చారు.

డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో ప్రత్యేకంగా క్లైమేట్ కాన్‌క్లేవ్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్‌లోని రెండు లక్షల డీజిల్ ఆటోలను యజమానులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నగర పరిధిలో డీజిల్ ఆర్టీసీ బస్సులను కూడా దశలవారీగా తొలగించనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎల్‌నీనో ఎఫెక్ట్.. రైతులకు సీఎం రేవంత్ కీలక సూచనలు!
ఎల్‌నీనో ఎఫెక్ట్.. రైతులకు సీఎం రేవంత్ కీలక సూచనలు!
ఉద్యోగం మారుతున్నారా..? పీఎఫ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు..
ఉద్యోగం మారుతున్నారా..? పీఎఫ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు..
తిరుమలలో నీటి కష్టాలు,110 రోజులకే నీటి నిల్వలు! సీఎం కీలక ఆదేశాలు
తిరుమలలో నీటి కష్టాలు,110 రోజులకే నీటి నిల్వలు! సీఎం కీలక ఆదేశాలు
నాని, కళ్యాణ్ రామ్‏తో సినిమాలు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్..
నాని, కళ్యాణ్ రామ్‏తో సినిమాలు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్..
తెలంగాణలో ఇండస్ట్రియల్ పాలసీ 2.0.. తయారీ రంగానికి కొత్త దశ
తెలంగాణలో ఇండస్ట్రియల్ పాలసీ 2.0.. తయారీ రంగానికి కొత్త దశ
IPL 2027 Captains: 7 జట్ల కెప్టెన్లు ఫిక్స్.. 3 జట్లకు ఎవరంటే?
IPL 2027 Captains: 7 జట్ల కెప్టెన్లు ఫిక్స్.. 3 జట్లకు ఎవరంటే?
కార్తిక దీపం రూపంలో మృత్యువు.. చిన్న నిర్లక్ష్యం 18 ఏళ్ల యువతి
కార్తిక దీపం రూపంలో మృత్యువు.. చిన్న నిర్లక్ష్యం 18 ఏళ్ల యువతి
బ్యాంక్ లాకర్లలో బంగారం దాచుకునేవారు ఈ విషయం మర్చిపోవద్దు..
బ్యాంక్ లాకర్లలో బంగారం దాచుకునేవారు ఈ విషయం మర్చిపోవద్దు..
తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. విదేశాల్లో ఉద్యోగం వస్తే..
తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. విదేశాల్లో ఉద్యోగం వస్తే..
మీరు ఏ గదిని ఎంచుకుంటారు? ఈ పర్సనాలిటీ టెస్ట్ మీ అసలు స్వభావాన్ని
మీరు ఏ గదిని ఎంచుకుంటారు? ఈ పర్సనాలిటీ టెస్ట్ మీ అసలు స్వభావాన్ని