AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken vs Soya Chunks: చికెన్ లేదా సోయా చంక్స్‌.. దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో తెలుసా?

మనం ఆరోగ్యంగా ఉండాలన్నా.. మనకు శక్తి కావాలన్నా ప్రోటీన్ చాలా అవసరం. కాబట్టి మన రోజువారీ ఆహారంలో ప్రోటీన్ చేర్చుకోవడం చాలా ముఖ్యం. అయితే నాన్‌వెజ్ తినేవారు ఎక్కువగా చికెన్‌, గుడ్ల నుంచి ప్రోటీన్ తీసుకుంటారు. అదే శాకాహారులైతే సోయాచంక్స్, పన్నీర్ ద్వారా ప్రోటీన్ పొందుతారు. అయితే ఇక్కడ చాలా మందిలో ఉన్న ప్రశ్న ఏమిటంటే సోయాచంక్స్ లేదా చికెన్.. రెండింటిని పోల్చుకుంటే దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఎవరికి ఏది మంచిదో ఇక్కడ చూద్దాం.

Anand T
|

Updated on: Nov 28, 2026 | 10:57 AM

Share
సోయాచంక్స్ బెనిఫిట్స్: సోయాచంక్స్‌ను ప్రోటీన్ పవర్‌హౌస్ అంటారు. మాంసాహారంతో సమానంగా ప్రోటీన్ అందించే ఏకైక చవకైన ఆహార పదార్థం ఇది మాత్రమే. ఇందులో కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. అంటే మన శరీర ఎదుగుదల, మరమ్మత్తుకు అవసరమైన, మన శరీరం స్వయంగా తయారు చేసుకోలేని 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉండి, అది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

1 / 5
అంతేకాదు ఇందులో కాల్షియం, మెగ్నీషియం, రాగి వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఐసోఫ్లేవోన్లు ఎముకల సాంద్రతను పెంచుతాయి, దీనివల్ల ఆస్టియోపోరోసిస్ ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది, తద్వారా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

2 / 5
చికెన్ ప్రయోజనాలు: నాన్‌వెజ్‌లో ప్రోటీన్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది చికెన్. ఇందులో ప్రోటీన్‌తో పాటు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి కండరాలను రిపేర్ చేసి వాటిని బలంగా మారుస్తాయి. జిమ్‌కు వెళ్లేవారికి, స్పోర్ట్స్ ఆడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి చికెన్ బ్రెస్ట్ మంచి ఆప్షన్. ఇందులో తక్కువ కొవ్వులు, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తిన్న తర్వాత ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల మీరు ఎక్కువగా తినడం తగ్గిస్తారు.

3 / 5
అంతేకాదు చికెన్‌లో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి, కీళ్ల నొప్పుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు చికెన్‌లోని ట్రిప్టోఫాన్, విటమిన్ B5 వంటి పోషకాలు శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచి, ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. చికెన్‌లో విటమిన్ B6 ఉంటుంది, ఇది 'హోమోసిస్టీన్' స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
 రెండింటిలో ఏది బెస్ట్:ప్రోటీన్ పరిమాణం విషయానికి వస్తే చికెన్ కంటే సోయాచంక్స్‌లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కానీ ప్రోటీన్ నాణ్యత, శరీరం గ్రహించే వేగంలో మాత్రం చికెనే ముందుంటుంది. బరువు తగ్గాలన్నా, బాడీ బిల్డ్ చేయాలన్నా చికెన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అదే మీకు తక్కువ బడ్జెట్‌లో ప్రోటీన్ కావాలనుకుంటే సోయాచంక్స్ బెస్ట్.

5 / 5
Follow Us
చికెన్ లేదా సోయా చంక్స్‌.. దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో తెలుసా?

బిస్లేరీ నీటిలో బ్యాక్టీరియా కలకలం..కంపెనీపై కేసుకు FSSAI అనుమతి!

ఆ హీరో నాకు నిజంగానే దేవుడు.. ఆయనతో ఒక్కరోజు నటించా..

IPL 2027 Auction: ఈ ముగ్గురు కోటీశ్వరులవ్వడం పక్కా..!

రెండుసార్లు మృత్యువును జయించిన నవ్వుల రారాజు.. చివరకు..

గోవర్ధన గిరి ప్రదక్షిణలో అనంత్ అంబానీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు

సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరుప్పరంకుండ్రంపై ఇవాళ దీపం

మన హీరోల ప్రస్థానం చాలా గొప్పది.. డైరెక్టర్ సందీప్..

ఇంట్లో సంపద,ప్రశాంతత కోసం ఈ రంగులను అస్సలు వాడకండి! వాస్తుప్రకారం

బిల్లుకు ప్రతిపక్ష పార్టీల మద్దతు కోసం ముమ్మర ప్రయత్నాలు..