AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా తమ ఉద్యోగుల PF మొత్తాలను సొంత PF ట్రస్టుల ద్వారా నిర్వహిస్తున్న కంపెనీలకు ప్రత్యేక అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులో..

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
Epfo
Subhash Goud
|

Updated on: Sep 06, 2026 | 9:50 PM

Share

EPFO: జీతం తీసుకునే వ్యక్తి మూల వేతనం నుండి 12% తీసివేసి ప్రావిడెంట్ ఫండ్ (PF)లో జమ చేస్తారు. కంపెనీ కూడా అంతే మొత్తాన్ని అందిస్తుంది. అందులో 3.67% EPFకి, 8.33% EPS (పెన్షన్ సిస్టమ్)కి వెళ్తుంది. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో ఈ డబ్బు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తరచుగా కొత్త నియమ నిబంధనలను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో ఈపీఎప్‌వో పీఎఫ్‌ ట్రస్టుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూన్‌లో ప్రారంభించిన ఈ పథకానికి గడువు ఇప్పుడు సమీపిస్తోంది. తమ పీఎఫ్‌ను నేరుగా EPFOలో జమ చేయకుండా, వారి కంపెనీ సొంత ట్రస్ట్ ద్వారా నిర్వహించుకుంటున్న ఉద్యోగులపై ఇది ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది.

ఈపీఎఫ్‌వో జూన్‌లో ఎంపిక చేసిన పీఎఫ్‌ ట్రస్టుల కోసం ‘ఒకేసారి మినహాయింపు పథకాన్ని’ ప్రారంభించింది. ఈ పథకం కింద అటువంటి పీఎఫ్‌ ట్రస్టులకు తమ పత్రాల పనిని మెరుగుపరచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్‌ను నేరుగా ఈపీఎప్‌వోలో జమ చేయకుండా, తమ సొంత ట్రస్టుల ద్వారా నిర్వహిస్తుంటాయి. ఇలా చేయడానికి వారు ఈపీఎఫ్‌ చట్టం కింద ప్రత్యేక అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

డిసెంబర్ 28 వరకు సమయం:

ఈ సౌకర్యం శాశ్వతమైనది కాదు. కానీ దీనికి ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంది. అర్హతగల పీఎఫ్ ట్రస్టులకు తమ స్థితిని క్రమబద్ధీకరించుకోవడానికి డిసెంబర్ 28, 2026 వరకు గడువు ఇచ్చింది. కొన్ని కంపెనీలు ఆదాయపు పన్ను శాఖ నుండి గుర్తింపు పొందినప్పటికీ, ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం అధికారిక అనుమతిని పొందలేదు. అయినప్పటికీ, అవి పన్ను ప్రయోజనాలను పొందుతూ వచ్చాయి. ఈ నియంత్రణపరమైన లోపాన్ని పరిష్కరించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

పీఎఫ్ ట్రస్టులు ఏమి చేయాలి?

చాలా కాలంగా సాంకేతిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ట్రస్టులకు ఇది ఒక పెద్ద ఊరట. నిబంధనల ప్రకారం, ఇలా మినహాయింపు పొందిన ట్రస్టులు, ఈపీఎఫ్‌వో ​​కింద నేరుగా అందించే ప్రయోజనాలకు కనీసం సమానమైన ప్రయోజనాలను తమ ఉద్యోగులకు అందించాల్సి ఉంటుంది. వారు పెట్టుబడి నిబంధనలు, సరైన రికార్డుల నిర్వహణ, ఇతర షరతులను ఖచ్చితంగా పాటించాలి. ఇంతకుముందు అనిశ్చిత పరిస్థితిలో ఉన్న ఆ కంపెనీల నియంత్రణ స్థితిని ఈ సౌకర్యం స్పష్టం చేస్తుంది.

ఇది కూడా చదవండి: Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..?

ఉద్యోగులు ఏం చేయాలి?

సొంత పీఎఫ్‌ ట్రస్ట్ ఉన్న కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తమ పీఎఫ్‌ అకౌంట్‌, కంపెనీ ట్రస్ట్ స్థితి, పీఎఫ్‌ జమలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా సంస్థ తమ పీఎప్‌ ట్రస్ట్‌కు సంబంధించిన ఈపీవోఫ్‌వో నిబంధనలు, అనుమతులను సరిగ్గా పాటిస్తోందా అనే విషయాన్ని హెచ్‌ఆర్‌ లేదా సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకోవచ్చు.

పీఎఫ్ ట్రస్ట్ అనేది కేవలం ఒక కంపెనీకి, ప్రభుత్వానికి మధ్య జరిగే కాగితపు వ్యవహారం మాత్రమే కాదు. ఇందులో లక్షలాది మంది ఉద్యోగులు తమ జీవితకాలంలో కష్టపడి కూడబెట్టిన పొదుపు ఉంటుంది. ట్రస్ట్ పెట్టుబడి నియమాలు, సరైన అకౌంటింగ్, నియంత్రణ స్థితి అనేవి ఉద్యోగుల సంక్షేమానికి నేరుగా ముడిపడి ఉంటాయి. ట్రస్ట్ సరిగ్గా పనిచేస్తే, ఉద్యోగుల నిధులు మరింత సురక్షితంగా ఉంటాయి. ఈ మినహాయింపు పథకం ద్వారా వ్యక్తిగత ట్రస్టుల ద్వారా విత్‌డ్రా చేసుకున్న పీఎఫ్‌కు, ప్రభుత్వ వ్యవస్థ ద్వారా నేరుగా పొందిన రక్షణనే ఖాతాదారులు పొందేలా ఈపీఎఫ్‌ఓ (EPFO) భరోసా ఇస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us