తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026.. హైదరాబాద్ కుర్రాడు విశేష్ శర్మ సంచలన విజయం
సొంత గడ్డపై తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026 టోర్నమెంట్‌లో 19 ఏళ్ల హైదరాబాద్ గోల్ఫర్ విశేష్ శర్మ తన కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో విశేష్ 21-అండర్ 259 స్కోరుతో విజయం సాధించి, 15 లక్షల నజరానా అందుకున్నాడు.
హైదరాబాద్ కుర్రాడు విశేష్ శర్మ చరిత్ర సృష్టించాడు. సొంత గడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్‌లో 19 ఏళ్ల విశేష్ తన కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించాడు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కోర్సులో హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో విశేష్ అసాధారణ ఆటతీరు కనబరిచి అందరినీ ఆకట్టుకున్నాడు. తన హోం కోర్స్‌లో అది కూడా 19 ఏళ్ల వయసులోనే తొలి ప్రొఫెషనల్ టైటిల్ గెలవడం మర్చిపోలేని అనుభూతి అని విశేష్ ఆనందం వ్యక్తం చేశాడు. మొత్తం రూ. 1 కోటి ప్రైజ్‌మనీతో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో విశేష్ శర్మ 21-అండర్ 259 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. నోయిడాకు చెందిన సీనియర్ గోల్ఫర్ అమర్‌దీప్ మాలిక్ నుంచి చివరి క్షణం వరకు తీవ్ర పోటీ ఎదురైంది. అమర్‌దీప్ 20-అండర్ 260 స్కోరుతో కేవలం ఒక్క స్ట్రోక్ తేడాతో రన్నరప్‌గా నిలవగా, విశేష్ త్రిల్లింగ్ విక్టరీ సాధించి ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ చారిత్రక విజయంతో విశేష్ శర్మ ట్రోఫీతో పాటు 15 లక్షల రూపాయల నజరానా అందుకున్నాడు. ఈ విజయం అతడికి పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ర్యాంకింగ్స్‌లోనూ మెరుగైన స్థానాన్ని తెచ్చిపెట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ 7 రోజువారీ అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి.. లేకపోతే మీ మెదడు షెడ్డుకే..!
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం.. ఆ కుటుంబం ఏం చేసిందో మీరే చూడండి!
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్.. ఏకంగా ఇంటి పైకప్పుపై మహీంద్రా స్కార్పియో
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

