కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
చైనాకు చెందిన 32 ఏళ్ల జాంగ్ జియాఖియావో ఓ సాధారణ పనిని వినూత్న వ్యాపారంగా మార్చి భారీగా సంపాదిస్తున్నాడు. షెంజెన్‌లో ‘సుమా’ పేరుతో ప్రొఫెషనల్ గోకే సేవలను ప్రారంభించిన అతను గంటకు సుమారు రూ.4,200 వసూలు చేస్తున్నాడు. కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో రెండు బ్రాంచీలు ప్రారంభించాడు. ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అందించే ఈ సేవ ద్వారా నెలకు సుమారు రూ.14 లక్షల వరకు ఆదాయం వస్తోందని జాంగ్ చెబుతున్నాడు.
ఉపాయం ఉన్నవాడు ఉపవాసం ఉండడు అని ఓ సామెత ఉంది. ఆ ఉపాయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని నిరూపించాడు చైనాకు చెందిన ఓ యువకుడు. సాధారణంగా మనం చేసే ఒక చిన్న పనిని, ఒక అద్భుతమైన వ్యాపారంగా మలిచి విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ, చైనాకు చెందిన 32 ఏళ్ల జాంగ్ జియాఖియావో అనే యువకుడు అది చేసి చూపించాడు. ఒంటిపై దురదగా ఉన్నప్పుడు ఎవరైనా గోకితే ఆ మజానే వేరు. ఈ చిన్న ఆలోచనే చైనాకు చెందిన 32 ఏళ్ల యువకుడు జాంగ్ జియాఖియావోకు లక్షల్లో లాభాలను తెచ్చిపెడుతోంది. ఎవరికీ అంతుచిక్కని ఈ వినూత్న ఆలోచనతో అతను ఏకంగా ప్రొఫెషనల్ ‘గోకే సేవలను’ ప్రారంభించి నెలకు లక్షలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. షెంజెన్ నగరంలో ‘సుమా’ పేరిట స్టోర్‌ను ప్రారంభించిన జాంగ్, గంట సేపు గోకించుకునేందుకు రూ.4,200 వసూలు చేస్తున్నాడు. కస్టమర్ల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనతో ఇప్పటికే రెండు బ్రాంచీలు తెరిచాడు. దీని ద్వారా అతనికి నెలకు సుమారు రూ.14 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది, ప్రత్యేక పరికరాలతో కస్టమర్లకు ఇష్టమైన ప్రాంతంలో సున్నితంగా గోకుతూ సేవనందిస్తున్నారు. తీవ్ర ఒత్తిడి నుంచి ఇది ఉపశమనం ఇస్తుందని, 70 శాతం మంది పురుషులూ దీనికి కస్టమర్లుగా ఉన్నారని జాంగ్ తెలిపారు. బాల్యంలో తండ్రి వీపు గోకిన జ్ఞాపకాలే ఈ బిజినెస్ ఐడియాకు కారణమని ఆయన చెప్పారు. గతంలో పలు వ్యాపారాల్లో నష్టపోయిన జాంగ్, ఇప్పుడు ఈ వింత ఆలోచనతో సక్సెస్ సాధించి భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వంద అవుట్‌లెట్లు తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం.. ఆ కుటుంబం ఏం చేసిందో మీరే చూడండి!
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్.. ఏకంగా ఇంటి పైకప్పుపై మహీంద్రా స్కార్పియో
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్‌ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

