గూగుల్‌లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు.. ఇప్పుడు ఇలా..

Rajitha Chanti

Pic credit - Instagram

06 September 2026

'బేబీ' చిత్రంతో టాలీవుడ్‌లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య. ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది ఈ భామ.

వైష్ణవి చైతన్య

షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్‌ల నుంచి మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు వెండితెరపై సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

వైష్ణవి చైతన్య

ఇటీవల ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన 'ఎపిక్' చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వైష్ణవి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

వైష్ణవి చైతన్య

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తనను చాలా చులకనగా మాట్లాడారని వైష్ణవి తెలిపారు. "అసలు నీకంటూ సమాజంలో ఏం గుర్తింపు ఉంది?

వైష్ణవి చైతన్య

గూగుల్‌లో నీ పేరు కొడితే కనీసం ఒక్క సమాచారమైనా వస్తుందా?" అని ముఖం మీదే ఎగతాళి చేశారని చెప్పారు. ఆ సమయంలో తన వద్ద ఎలాంటి విజయాలూ లేకపోవడంతో

వైష్ణవి చైతన్య

ఆ మాటలు తీవ్రంగా గాయపరిచాయని, మౌనంగా భరించడం తప్ప ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆ అవమానమే తన ఎదుగుదలకు ఇంధనంగా మారిందని పేర్కొన్నారు.

వైష్ణవి చైతన్య

"ఈరోజు ఎవరైనా గూగుల్ సెర్చ్‌లో 'వైష్ణవి చైతన్య' అని టైప్ చేస్తే నా సినీ ప్రయాణం, నేను సాధించిన విజయాలు, నటించిన సినిమాల జాబితా కనిపిస్తుంది.

వైష్ణవి చైతన్య

నాడు నన్ను కించపరిచిన మాటలకు కాలం ఇచ్చిన సమాధానం ఇది. నా జీవితంలో నేను సాధించిన అసలైన 'ఎపిక్ మూమెంట్' ఇదే" అని ఆమె సగర్వంగా అన్నారు. 

వైష్ణవి చైతన్య