AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస‌లు జుట్టు ఎందుకు రాలిపోతుంది..? లోపం ఎక్కడ ఉందో తెలుసుకోండి..!

నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో జుట్టు విపరీతంగా రాలడం ఒకటి. వర్షాకాలం, శీతాకాలంలో ఇది మరింత ఎక్కువవుతుంది. సాధారణంగా జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, శరీరంలో ఒక ముఖ్యమైన విటమిన్‌ లోపం ప్రధానమైన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మన శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి, వెంట్రుకల కుదుళ్లను బలంగా ఉంచడానికి, స్కాల్ప్‌లో ఉండే జిడ్డు గ్రంధులు సరిగ్గా పనిచేయడానికి ఎంతో సహాయపడుతుంది. అలాంటి అతి ముఖ్యమైన విటమిన్‌ ఏంటి..? పూర్తి వివరాల్లోకి వెళితే..

అస‌లు జుట్టు ఎందుకు రాలిపోతుంది..? లోపం ఎక్కడ ఉందో తెలుసుకోండి..!
Zinc Deficiency Hair Loss
Jyothi Gadda
|

Updated on: Aug 12, 2026 | 4:35 PM

Share

జుట్టు ఆరోగ్యం మన శరీరంలో ఉండే పోషకాలపై ఆధారపడి ఉంటుంది. పోషకాహార లోపం వల్ల తలెత్తే సమస్యలలో జుట్టు రాలడం ప్రథమ స్థానంలో ఉంటుంది. అనేక రకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడినా ఫలితం లేకపోతే, దానికి కారణం శరీరంలో జింక్ లోపం కావచ్చు. జింక్ అనేది మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం.

జుట్టు ఆరోగ్యానికి జింక్ ఎందుకు అవసరం?

జింక్ వెంట్రుకల కణజాలం పెరుగుదలకు, దెబ్బతిన్న కణాలను బాగు చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వెంట్రుకల కుదుళ్ల చుట్టూ ఉండే తైల గ్రంధులు సరిగ్గా పనిచేసేలా చూస్తుంది. శరీరంలో జింక్ స్థాయిలు తగ్గినప్పుడు కుదుళ్లు బలహీనపడి, జుట్టు అధికంగా రాలడం ప్రారంభమవుతుంది.

జింక్ లోపం ముఖ్య లక్షణాలు:

తల దువ్వినప్పుడు లేదా తలస్నానం చేసినప్పుడు జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోవడం.

ఇవి కూడా చదవండి

వెంట్రుకలు సన్నగా, జీవం లేనట్లుగా తయారుకావడం.

గోళ్లు త్వరగా విరిగిపోవడం, చర్మం పొడిబారడం.

గాయాలు త్వరగా మానకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం.

జింక్ లోపాన్ని అధిగమించే ఆహార పదార్థాలు:

రోజువారీ ఆహారంలో జింక్ లభించే సహజ సిద్ధమైన పదార్థాలను చేర్చుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని సులభంగా అరికట్టవచ్చు.

విత్తనాలు: గుమ్మడి విత్తనాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలలో జింక్ సమృద్ధిగా ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ ప్రతిరోజూ తినడం వల్ల జుట్టుకు కావలసిన పోషకాలు లభిస్తాయి.

పప్పు ధాన్యాలు: పెసలు, శనగలు, రాగులు, మినపప్పు వంటి ధాన్యాలలో జింక్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.

పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, పనీర్ లో జింక్ సరిపడా లభిస్తుంది.

మాంసాహారం: డిష్‌లో చేపలు, గుడ్లు, చికెన్ చేర్చుకోవడం వల్ల శరీరానికి తగినంత జింక్ లభించి జుట్టు దృఢంగా మారుతుంది.

కేవలం బాహ్య సంరక్షణే కాకుండా, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా మాత్రమే జుట్టు రాలడాన్ని అరికట్టి, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us