AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ సూపర్‌ గుడ్ న్యూస్! అతి తక్కువ ధరలోనే అద్దిరిపోయే టూర్‌.. ఏయే ప్రదేశాలు చూడొచ్చు?

రామాయణ కాలం నాటి పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనే కోరిక ఉన్న భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. శ్రీలంకలోని ప్రముఖ రామాయణ సంబంధిత క్షేత్రాలతో పాటు అక్కడి పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ శ్రీలంక రామాయణ యాత్ర పేరిట ఈ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ప్యాకేజీ వివరాలు, ప్రయాణ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం...

IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ సూపర్‌ గుడ్ న్యూస్! అతి తక్కువ ధరలోనే అద్దిరిపోయే టూర్‌.. ఏయే ప్రదేశాలు చూడొచ్చు?
Irctc Tour Package
Jyothi Gadda
|

Updated on: Aug 11, 2026 | 5:07 PM

Share

రామాయణానికి సంబంధించిన పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా రామాయణానికి సంబంధించిన పవిత్ర స్థలాలను సందర్శించాలనుకుంటే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. IRCTC యాత్రికుల కోసం ఒక ప్రత్యేక శ్రీలంక రామాయణ యాత్ర ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ యాత్ర ప్యాకేజీ భక్తులను రామాయణ కాలానికి సంబంధించిన అనేక పుణ్యక్షేత్రాలకు, అలాగే శ్రీలంకలోని కొన్ని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు తీసుకువెళుతుంది. ఈ యాత్ర ప్యాకేజీ ధర, సౌకర్యాల గురించి మరింత తెలుసుకుందాం…

రామాయణంతో సంబంధం ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం IRCTC ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. ఈ యాత్ర 2026 సెప్టెంబర్ 24న బెంగళూరు విమానాశ్రయం నుండి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఎకానమీ క్లాస్ ఫ్లైట్ ద్వారా ప్రారంభమవుతుంది.

సందర్శించే ముఖ్యమైన క్షేత్రాలు:

మొదటి రోజు: బెంగళూరు నుండి కొలంబో చేరుకుని, అక్కడ నుండి దంబుల్లా వెళ్లే మార్గంలో మనవారి, మునీశ్వరం ఆలయాల దర్శనం.

ఇవి కూడా చదవండి

రెండో రోజు: దంబుల్లా గుహాలయం, త్రింకోమలీలోని తిరు కోనేశ్వరం ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాళ్ ఆలయ సందర్శన.

మూడో రోజు: క్యాండీ నగరం ప్రయాణం, టెంపుల్ ఆఫ్ ద టూత్ (దంత ఆలయం) దర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు.

నాల్గవ రోజు: నువారా ఎలియాలోని శ్రీ భక్త హనుమాన్ ఆలయం, రాంబోడా, సీతా అమ్మన్ ఆలయం, అశోక వాటిక సందర్శన.

ఐదో రోజు: పిన్నవాల ఏనుగుల అనాథశరణాలయం, కొలంబో నగర విహారం, కేలనియా బుద్ధ ఆలయం, బలి ఆంజనేయ ఆలయ దర్శనం.

ఆరో రోజు: కొలంబోలో షాపింగ్ అనంతరం తిరిగి బెంగళూరుకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు (ప్రతి ఒక్కరికి):

సింగిల్ ఆక్యుపెన్సీ : రూ. 81,100

డబుల్ ఆక్యుపెన్సీ: రూ. 60,500

ట్రిపుల్ ఆక్యుపెన్సీ : రూ. 59,950

పిల్లలకు (5-11 ఏళ్లు, బెడ్‌తో): రూ. 46,000

ప్యాకేజీలో లభించే సౌకర్యాలు:

ఈ ప్యాకేజీలో విమాన టికెట్లు, 5 రాత్రుల హోటల్ వసతి, ప్రతిరోజు ఉదయం ఉపహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం (టిఫిన్/భోజనాలు), ఎంట్రీ టికెట్లు, ఇంగ్లీష్ మాట్లాడే గైడ్, విదేశీ ప్రయాణ ఇన్సూరెన్స్‌, జీఎస్టీ/టిసిఎస్ చేర్చబడ్డాయి. అయితే పాస్‌పోర్ట్ గడువు తిరిగొచ్చే తేదీ నుండి కనీసం 6 నెలలు ఉండటం తప్పనిసరి. ఆసక్తి గల భక్తులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us