AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో పులి.. విదేశాల్లో పిల్లి.. అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!

Abhishek Sharma, Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై మాజీ భారత ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో విదేశీ పరిస్థితుల్లో బంతి స్వింగ్ అయితే ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇంటి పరిస్థితుల్లో చూపించే దూకుడును విదేశీ పిచ్‌లపైనా కొనసాగించేందుకు ఈ యువ బ్యాటర్లు ప్రత్యేకంగా పనిచేయాలని సూచించారు.

Venkata Chari
|

Updated on: Sep 21, 2026 | 8:50 AM

Share
Abhishek Sharma, Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ జట్టు (Team India) యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)పై మాజీ భారత ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ (Sandeep Patil) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరిలోనూ అపారమైన ప్రతిభ, భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఉన్నాయని ప్రశంసిస్తూనే విదేశీ పరిస్థితుల్లో ఎదురయ్యే సవాల్‌పై విమర్శలు గుప్పించారు.

1 / 7
ముఖ్యంగా బంతి కాస్త స్వింగ్ అవుతున్నప్పుడు ఇద్దరూ ఇబ్బంది పడుతున్న తీరు కనిపించిందని చెప్పారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. స్వదేశంలో అత్యంత దూకుడుగా ఆడే బ్యాటర్లు, విదేశాల్లోనూ అదే స్థాయి ప్రభావం చూపేలా తమ ఆటను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని పాటిల్ సూచించారు. యువ ఆటగాళ్లు ఆ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.

2 / 7
జులైలో జరిగిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో అభిషేక్ ఐదు మ్యాచ్‌లు ఆడి 131 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లోనే వైభవ్ టీ20 అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌లలో అతడు 42 పరుగులు సాధించాడు. స్వింగ్‌కు అనుకూల పరిస్థితుల్లో ఇద్దరి బ్యాటింగ్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయని పాటిల్ వివరించారు.

3 / 7
తరువాతి సిరీస్‌లో వైభవ్ తన ఆటతో బదులిచ్చాడు. జింబాబ్వేపై భారత్ 3-0తో టీ20 సిరీస్‌ను గెలిచిన సమయంలో అతడు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. చివరి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.

4 / 7
ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అభిషేక్ కూడా తన సత్తా చాటాడు. భారత్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో అతడు కేవలం 30 బంతుల్లోనే రికార్డు సెంచరీ సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌పై పాటిల్ ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు.

5 / 7
ఆధునిక క్రికెట్‌లో యువ బ్యాటర్లకు తొలి బంతి నుంచే తమ సహజ దూకుడుతో ఆడే స్వేచ్ఛ లభిస్తోందని పాటిల్ పేర్కొన్నారు. అభిషేక్, వైభవ్ ఆ అవకాశాన్ని సమర్థంగా వినియోగిస్తున్నారని ప్రశంసించారు. ఇద్దరిలోనూ శక్తి, నైపుణ్యం, షాట్ మేకింగ్ సామర్థ్యం ఉన్నాయని చెప్పారు.

6 / 7
అయితే విదేశీ పర్యటనల్లో పరిస్థితులు మారినప్పుడు అదే దూకుడును నిలబెట్టుకోవడం కీలకమని ఆయన సూచనలో స్పష్టమైంది. స్వింగ్ అవుతున్న బంతిని ఎదుర్కొనే విషయంలో మెరుగుదల సాధిస్తే ఈ ఇద్దరు యువ బ్యాటర్ల ఆట మరింత విస్తరించే అవకాశం ఉంటుంది.

7 / 7
Follow Us