AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..

నేటి కాలంలో ఇంట్లోనే స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవడానికి చాలామంది టెర్రస్ గార్డెనింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, సరైన అవగాహన లేకుండా డాబాపై గార్డెనింగ్ ప్రారంభించడం వల్ల భారం పెరిగి గోడలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే బరువైన మట్టి కుండీల స్థానంలో తేలికపాటి గ్రో-బ్యాగ్స్, ప్లాస్టిక్ కుండీలు వాడటం ఎంతో మేలు. అలాగే మరిన్ని టిప్స్‌ కూడా ఉన్నాయి.. అవేంటంటే..

ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..
Terrace Gardening
Jyothi Gadda
|

Updated on: Aug 11, 2026 | 3:52 PM

Share

ఇంటి కప్పుపై పచ్చని మొక్కలను పెంచడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, మన చేతులతో పెంచిన ఆర్గానిక్ కూరగాయలను తినే ఆనందం లభిస్తుంది. అయితే గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారు డాబా దెబ్బతినకుండా, మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సరైన అవగాహన లేకుండా డాబాపై గార్డెనింగ్ ప్రారంభించడం వల్ల భారం పెరిగి గోడలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే..

గ్రో బ్యాగ్స్, ప్లాస్టిక్ కుండీల వాడకం:

డాబాపై సిమెంట్ లేదా సిరామిక్ కుండీల భారాన్ని తగ్గించడానికి గ్రో బ్యాగ్స్, తేలికపాటి ప్లాస్టిక్ కుండీలను ఎంచుకోవాలి. దీనివల్ల బిల్డింగ్‌పై ఎక్కువ భారం పడదు. గోడలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉండదు. నీరు సులభంగా బయటకు వెళ్లేలా కుండీల అడుగున చిన్న హోల్స్ ఉండటం చాలా ముఖ్యం.

సరైన పాటింగ్ మిశ్రమం:

కేవలం బరువైన మట్టినే వాడకుండా కొబ్బరి పొట్టు కోకోపీట్, పైమట్టి, ఎండిన పశువుల ఎరువులను సమాన నిష్పత్తిలో కలిపి పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇది మట్టిని తేలికగా ఉంచి వేర్లకు గాలి ఆడేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎండ, నీటి సరఫరా:

మొక్కలు బాగా పెరగాలంటే రోజుకు కనీసం 5 నుండి 6 గంటల పాటు మంచి సూర్యరశ్మి తగిలే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. నీటిని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో అవసరమైనంత మాత్రమే పోయాలి. కుండీలలో నీరు నిలిచిపోకుండా చూసుకోవడం వల్ల వేర్లు కుళ్ళిపోకుండా ఉంటాయి.

సేంద్రియ ఎరువులు, పురుగుల నివారణ:

ప్రతి రెండు వారాలకు ఒకసారి జీవామృతం లేదా వేప పిండి వంటి ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఎరువులను అందించాలి. మొక్కలకు పురుగులు పట్టకుండా ఉండటానికి వేప నూనె, వెల్లుల్లి మిశ్రమం లేదా సబ్బు నీటిని క్రమం తప్పకుండా పిచికారీ చేయాలి.

తీగ మొక్కలకు ఆధారాలు:

కాకర, పొట్ల, బీర వంటి పాకే తీగ మొక్కల కోసం టెర్రస్‌పై చిన్న పందిరి లేదా తీగలను ఏర్పాటు చేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంటి డాబా సురక్షితంగా ఉండటంతో పాటు చక్కని గార్డెన్ మీ సొంతమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us