AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిరియాల రసం.. ఇలా చేస్తే కడుపు నిండా అన్నం తింటారు

కొంత మంది ఫ్రై కర్రీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరికొంత మందికి రసాలు ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అయితే మీ ఇంటిలోని వారు కడుపు నిండుగా అన్నం తినాలి అంటే తప్పకుండా ఈ రసం చేయాలి. అది ఏమిటి అనుకుంటున్నారా? మిరియాల రసం. కాగా, దీనిని ఇంటిలోనే సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Sep 20, 2026 | 1:46 PM

Share

1 / 5
మిరియాల రసం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా ఇది చాలా రుచిగా ఉండటం వలన అన్నం ఎక్కువగా తినని వారు కూడా కడుపు నిండుగా తింటారు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే మీరు కూడా మీ ఇంటిలో మిరియాల రసం చేయాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి.

2 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే, మిరియాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర , వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, పసుపు, ఎండు మిర్చి, పెద్ద టమాట, చింత పండు నిమ్మకాయ సైజు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఒక లవంగం.

3 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా, ఓ టేబుల్ స్పూన్ మిరియాలు, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-15 వెల్లుల్లి రెబ్బలను కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది చారుకు మంచి రుచిని అందిస్తుంది. అనంతరం, ఓ టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి, అందులో ఓ టీ స్పూన్ ఆవాలు, పావు చెంచా పసుపు, మూడు ఎండు మిర్చి వేసి వేయించాలి. తరువాత, ఒక పెద్ద పండు టమాటో ముక్కలు వేసి, అవి మెత్తగా గుజ్జు అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

4 / 5
ఇప్పుడు, నిమ్మకాయంత చింతపండు నుండి తీసిన సుమారు అర లీటర్ చింతపండు నీళ్లను కలపాలి. దంచుకున్న మిరియాలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. చివరగా, నాలుగైదు రెబ్బల కరివేపాకు, పిడికెడు కొత్తిమీర తరుగు, పావు చెంచా ఇంగువ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు రానిస్తే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ మిరియాల చారు రెడీ.

5 / 5
Follow Us