AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక! ఎక్కడుందో తెలుసా?

స్మశానవాటిక అనగానే సాధారణంగా నిశ్శబ్దం, భయం లేదా నిర్మానుష్యమైన వాతావరణం గుర్తుకొస్తుంది. కానీ, నలుమూలల నుండి ప్రజలు చూడటానికి వచ్చే స్మశానవాటిక ప్రపంచంలో ఒకటి ఉందని ఎవరైనా మీకు చెబితే, అది నమ్మడం కష్టంగా ఉండవచ్చు. మొదటిసారిగా చూసిన ప్రతి ఒక్కరూ అది ఒక రాజభవనం, పురాతన మ్యూజియం, లేదంటే విశాలమైన, పాతకాలపు రైల్వే స్టేషన్ అని భావించవచ్చు. కానీ, వాస్తవానికి అది ఒక స్మశానవాటిక. తన వాస్తుశిల్పం, సాటిలేని అందంతో పర్యాటకులను చూడగానే ఆకట్టుకుంటుంది. ఇంతకీ అంత సుందరమైన స్మశానవాటిక ఎవరిది..? ఎక్కడ ఉంది తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే...

ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక! ఎక్కడుందో తెలుసా?
Monumental Cemetery Milan
Jyothi Gadda
|

Updated on: Aug 11, 2026 | 2:36 PM

Share

సాధారణంగా స్మశానవాటికల పేరు వినగానే మన మనస్సులో నిశ్శబ్దంగా, కాస్త భయానకంగా ఉండే నిర్మానుష్యమైన ప్రాంతాలుగా గుర్తుకువస్తాయి.. కానీ, ఇటలీలోని మిలాన్ నగరంలో ఉన్న ఒక స్మశానవాటిక మాత్రం ఈ భావనను పూర్తిగా మార్చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటికగా పేరుగాంచిన మాన్యుమెంటల్ సెమిట్రీ అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ ప్రదేశం మరోసారి వార్తల్లో నిలిచింది.

రాజభవనాన్ని తలపించే నిర్మాణ శైలి:

ఈ ప్రదేశాన్ని మొదటిసారి చూసిన ఎవరైనా సరే, ఇది ఒక రాజభవనమో, కళాత్మక మ్యూజియమో లేదా ప్రాచీన కాలం నాటి ఘనమైన రైల్వే స్టేషనో అనుకుని పొరబడతారు. అంతటి ఘనమైన ఆర్కిటెక్చర్, రాతి చెక్కడాలు, అద్భుత శిల్పకళలతో ఇది నిర్మించబడింది. ఇటీవల సోషల్ మీడియాలో శ్రీధర్ మిశ్రా అనే బ్లాగర్ షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ కావడంతో, ఈ స్మశానవాటిక విశేషాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఇవి కూడా చదవండి

అడుగడుగునా పరిశుభ్రత, ప్రశాంతత:

ఈ కాంప్లెక్స్ వెలుపలి రహదారులు, చతురస్రాలు ఎంత శుభ్రంగా ఉంటాయంటే, ఇక్కడొక స్మశానవాటిక ఉందంటే ఎవరూ నమ్మలేరు. సాధారణ పర్యాటకులతో పాటు మరణించిన తమ ప్రియమైనవారికి నివాళులర్పించడానికి వచ్చే కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా తాజా పూల దుకాణాలు ఉంటాయి. రంగురంగుల సువాసనల పూలతో నిండి ఉండే ఈ షాపులు ఈ ప్రాంతానికి మరింత శోభను తెచ్చిపెడతాయి.

కళా ప్రేమికులకు, చరిత్రకారులకు స్వర్గధామం:

ఈ స్మశానవాటిక కేవలం స్మారక ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఒక బహిరంగ శిల్పకళా ప్రదర్శనశాల లాంటిది. ఇటలీకి చెందిన ప్రముఖ శిల్పులు, వాస్తుశిల్పులు చెక్కిన విగ్రహాలు, సమాధుల పైకప్పుల నిర్మాణాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్పంపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.

మరణం వెనుక ఉన్న భయాన్ని కాకుండా, జీవితపు చారిత్రక సౌందర్యాన్ని, శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పే ఈ మాన్యుమెంటల్ సెమిట్రీ మిలాన్ పర్యటనకు వచ్చే పర్యాటకులకు తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us