AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ ఇదెక్కడి విచిత్రం.. కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! షాకింగ్‌ వీడియో వైరల్‌..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వింతలు, విశేషాలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి మనిషి రూపం నుండి కుక్కలా మారడానికి ఏకంగా రూ. 220 కోట్లు ఖర్చు చేశాడంటూ కొందరు పోస్టులు పెట్టడంతో ఈ వార్త నెటిజన్లను విపరీతంగా ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలు ఎఐ (AI) సృష్టి అని కొందరు, నిజంగానే మనిషి మారారా అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ వైరల్ దావా వెనుక అసలు నిజం వేరే ఉంది.

వార్నీ ఇదెక్కడి విచిత్రం.. కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! షాకింగ్‌ వీడియో వైరల్‌..
Japanese Man Dog Costume
Jyothi Gadda
|

Updated on: Aug 10, 2026 | 8:42 PM

Share

సోషల్ మీడియాలో ఒక వింత వాదన వైరల్ అవుతోంది. ఒక జపనీస్ కోటీశ్వరుడు తనను తాను కుక్కలా మార్చుకోవడానికి సుమారు 2.2 బిలియన్ రూపాయలు ఖర్చు చేశాడని చెబుతున్నారు. అతను వివిధ శస్త్రచికిత్సలు, ప్రక్రియల ద్వారా తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడని వాదిస్తున్నారు. వీడియోలు, ఫోటోలు చూసిన తర్వాత, కుక్కగా మారడానికి ఎవరైనా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వైరల్ వాదన వెనుక ఉన్న కథ కాస్త భిన్నంగా ఉంది. అసలు కథేమిటంటే..

జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు. అతనికి చిన్నతనం నుంచి నాలుగు కాళ్ల జంతువుల వలే జీవించాలనే విచిత్రమైన కోరిక ఉండేది. తన కోరికను నెరవేర్చుకోవడానికి అతను జపాన్‌లోని సినిమాలు, ప్రకటనలకు ప్రత్యేక కాస్ట్యూమ్స్ తయారు చేసే జెప్పెట్ అనే ప్రసిద్ధ కంపెనీని సంప్రదించాడు.

ఇవి కూడా చదవండి

12 లక్షల రూపాయల ప్రత్యేక కాస్ట్యూమ్:

టోకో కోరిక మేరకు సదరు కంపెనీ బోర్డర్ కాలీ అనే కుక్క జాతి రూపాన్ని ఎంచుకుని, ఒక హైపర్-రియలిస్టిక్ అంటే అచ్చం నిజమైన కుక్కలా ఉండే డ్రెస్‌ను సిద్ధం చేసింది. మనిషి అస్థిపంజరం ఆకారాన్ని కుక్క శరీర ఆకారంలో దాచడం సవాలుగా మారడంతో ఈ డ్రెస్ తయారీకి 40 రోజుల సమయం పట్టింది. దీనికి దాదాపు 20 లక్షల జపనీస్ యెన్లు ఖర్చయ్యాయి. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 11 నుంచి 12 లక్షలు మాత్రమే. సోషల్ మీడియా ప్రచారంలో చెప్తున్నట్లు 220 కోట్లు అనేది కేవలం అబద్ధం.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by @hunnyismm

సోషల్ మీడియాలో ప్రాచుర్యం:

టోకో ఈ కాస్ట్యూమ్ ధరించి నాలుగు కాళ్లపై నడుస్తూ, పార్కుల్లో నిజమైన కుక్కలతో కలిసి తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఐ వాంట్ టు బి యాన్ యానిమల్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడుపుతున్నాడు. కాగా, భవిష్యత్తులో పాండా లేదా ఎలుగుబంటి లాంటి ఇతర జంతువుల డ్రెస్సులను కూడా ధరించి ప్రయత్నిస్తానని టోకో పేర్కొన్నాడు.

మరిన్నిట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us