దంతాలపై పేరుకున్న పాచి తొలగించడానికి కొబ్బరి నూనె, బేకింగ్ సోడా ఉపయోగపడతాయా?
రోజువారీ పళ్ళు తోముకున్నప్పటికీ, చాలా మందిలో దంతాలపై కఠినమైన పాచి, మురికి మరకలు పేరుకుపోతుంటాయి. వీటిని సులభంగా తొలగించడానికి మన వంటింట్లో లభించే బేకింగ్ సోడా, కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తాయి. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు లేదా కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా తయారుచేసి, బ్రష్ సహాయంతో పళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇది దంతాల పాచిని పోగొట్టడంతో పాటు నోటి దుర్వాసనను, హానికర బ్యాక్టీరియాని నశింపజేస్తుంది. అలాగే ఉదయాన్నే కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మనం ఎంత శ్రద్ధగా రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకున్నప్పటికీ, దంతాల పై భాగంలో, మూలల్లో కఠినమైన పాచి, పసుపు రంగు మరకలు పేరుకుపోవడం చాలా సాధారణం. ఈ సమస్య కాలక్రమేణా దంతాలను బలహీనపరచడమే కాకుండా చిగుళ్ల సమస్యలకు దారితీస్తుంది. వీటిని తొలగించుకోవడానికి ఖరీదైన డెంటల్ ట్రీట్‌మెంట్‌లకు వెళ్లకుండా, మన వంటింట్లో లభించే సాదాసీదా పదార్థాలతో సులభంగా ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బేకింగ్ సోడా తో అద్భుతమైన ప్రయోజనం:
దంతాలపై పడిన మొండి మరకలను వదిలించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో 1 నుండి 2 స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని, అందులో తగినన్ని నీళ్లు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ టూత్‌బ్రెస్ట్‌పై వేసి పళ్లను, ముఖ్యంగా మరకలు ఎక్కువగా ఉన్న వెనుక భాగాలను సుమారు ఒక నిమిషం పాటు మెల్లిగా రుద్దాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో నోరు కడుక్కోవాలి. వారంలో 2 నుంచి 3 సార్లు ఇలా చేయడం వల్ల పళ్లపై ఉన్న పాచి పూర్తిగా తొలగిపోతుంది.
కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్:
నోటి ఆరోగ్యానికి కొబ్బరి నూనె దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం బ్రష్ చేసే ముందు ఒక స్పూన్ పచ్చి కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని కొన్ని నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది, చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది. పంటి నొప్పులు దూరం అవుతాయి.
కొబ్బరి నూనె, బేకింగ్ సోడా కాంబినేషన్:
బేకింగ్ సోడా, కొబ్బరి నూనె రెండింటినీ కలిపి ఉపయోగిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి మిశ్రమంలా చేయాలి. దీనిని బ్రష్‌కి రాసుకుని పళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇది పళ్లపై ఉన్న మురికిని, పసుపు రంగును వదిలించడంతో పాటు నోటిని తాజాగా ఉంచుతుంది. దుర్వాసన రాకుండా నివారిస్తుంది. ఈ సాధారణ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా దంతాలను ఆరోగ్యంగా, తెల్లగా, మెరిసేలా ఉంచుకోవచ్చు.




