AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరాయి వ్యక్తితో భార్య ఏకాంతంగా ఉండగా భర్త ఎంట్రీ..! ఇంతలోనే దారుణం..!

తమిళనాడులో అనైతిక సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి భార్యతో పాటు ఆమె ప్రియుడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ జంట హత్యల ఘటన విరుదునగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

పరాయి వ్యక్తితో భార్య ఏకాంతంగా ఉండగా భర్త ఎంట్రీ..! ఇంతలోనే దారుణం..!
Double Murder
Balaraju Goud
|

Updated on: Nov 17, 2026 | 12:09 PM

Share

తమిళనాడులో అనైతిక సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి భార్యతో పాటు ఆమె ప్రియుడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ జంట హత్యల ఘటన విరుదునగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అరుప్పుకోటై సమీపంలోని పాళయంపట్టి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న శరవణకుమార్‌కు పొన్నళగు అనే మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే పొన్నళగుకు అదే ప్రాంతానికి చెందిన ఆనందరాజ్‌తో కొంతకాలంగా పరిచయం కొనసాగుతోంది. ఆనందరాజ్‌కు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య, ఆనందరాజ్ మధ్య ఉన్న సంబంధం గురించి శరవణకుమార్‌కు తెలియడంతో గతంలోనే ఆమెను హెచ్చరించినట్లు సమాచారం. అయినప్పటికీ వారి మధ్య పరిచయం కొనసాగుతుండటంతో భర్త తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే భార్య పొన్నళగు, ఆనందరాజ్ ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో శరవణకుమార్ అక్కడికి చేరుకున్నాడు. ఆవేశంతో తన వెంట తెచ్చుకున్న కొడవలితో ఇద్దరిపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా రాయితో దాడి చేసి వారిని హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అరుప్పుకోటై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు నిందితుడు శరవణకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంట హత్యలకు దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు. కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ గౌతమ్ గోయల్ వెల్లడించారు. ముగ్గురు పిల్లల తల్లి, ఇద్దరు పిల్లల తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us