AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఇంటి పైకప్పు.. శిథిలాల కింద ఆరుగురు!

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలో మంగళవారం (నవంబర్ 17) ఓ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద ఆరుగురు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఢిల్లీ పోలీసులు, ఇతర సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగాయి.

ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఇంటి పైకప్పు.. శిథిలాల కింద ఆరుగురు!
Delhi Building Accident
Balaraju Goud
|

Updated on: Nov 17, 2026 | 11:37 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలో మంగళవారం (నవంబర్ 17) ఓ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద ఆరుగురు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మంగళవారం ఉదయం సుమారు 10:13 గంటలకు అగ్నిమాపక శాఖకు ప్రమాదంపై సమాచారం అందింది. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఢిల్లీ పోలీసులు, ఇతర సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగాయి.

ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు, బాధితుల పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us