AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూమ్ అద్దె విషయంలో గొడవ.. రూ.100 కోసం యువకుడిను కొట్టి చంపిన లాడ్జి సిబ్బంది!

భద్రాచలం రామాలయం సమీపంలోని శ్రీ సత్యసాయి రెసిడెన్సీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూమ్ అద్దె విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో లాడ్జి సిబ్బంది దాడి చేయడంతో తెల్లం శరత్ (25) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

రూమ్ అద్దె విషయంలో గొడవ.. రూ.100 కోసం యువకుడిను కొట్టి చంపిన లాడ్జి సిబ్బంది!
Lodge Rent Dispute Turns Fatal In Bhadrachalam
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 17, 2026 | 11:13 AM

Share

భద్రాచలం, నవంబర్ 17: భద్రాచలంలో రామాలయం ఏరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాడ్జి అద్దె విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. రామాలయం సమీపంలోని శ్రీ సత్యసాయి రెసిడెన్సీలో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో తెల్లం శరత్ (25)అనే యువకుడు మృతి చెందాడు. రూమ్ అద్దె, ఆధార్ కార్డు, రేషన్ కార్డు విషయంలో మొదలైన వివాదం ..లాడ్జి సిబ్బంది పిడి గుద్దులతో దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు శరత్. అక్సిడింట్ ఆయందని చిత్రీకరించేందుకు లాడ్జ్ నిర్వాహకులు తెల్లం శరత్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.భద్రాచలం రామాలయం సమీపంలోని శ్రీ సత్యసాయి రెసిడెన్సీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

భద్రాచలంలో జొమాటోలో పనిచేస్తున్న తెల్లం శరత్ వద్దకు హైదరాబాద్ నుంచి అతని స్నేహితులు రావడంతో.. వారంతా కలిసి లాడ్జిలో రూమ్ తీసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న యువకులు రూమ్ కావాలని అడగగా.. లాడ్జి నిర్వాహకులు 600 రూపాయలు అద్దెగా చెప్పినట్లు సమాచారం. అయితే 500 రూపాయలు ఇవ్వాలంటూ చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో లాడ్జి యజమాని తన వద్ద పనిచేసే మణికంఠను పిలవగా.. అక్కడికి వచ్చిన మణికంఠ శరత్‌పై పిడిగుద్దులతో దాడి చేశారు. ఈ దాడిలో శరత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతనితో వచ్చిన స్నేహితులపై కూడా దాడి చేయగా.. ఒకరు అక్కడి నుంచి పారిపోగా, మరొకరు అక్కడే ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

అప్పటికే స్పృహ కోల్పోయిన శరత్‌ను స్కూటీపై ఎక్కించి, అదే వ్యక్తి సహాయంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో యాక్సిడెంట్ జరిగిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చి శరత్‌ను చేర్పించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించే మార్గంలోనే శరత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు…ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Follow Us
దారుణం.. రూ.100 కోసం యువకుడిను కొట్టి చంపిన లాడ్జి సిబ్బంది!
దారుణం.. రూ.100 కోసం యువకుడిను కొట్టి చంపిన లాడ్జి సిబ్బంది!
అంత పెద్ద హీరోయిన్.. నా సినిమాలో స్పెషల్ సాంగ్
అంత పెద్ద హీరోయిన్.. నా సినిమాలో స్పెషల్ సాంగ్
చేతులు, కాళ్లు దురద పెడుతున్నాయా? శరీరంలో ఈ సమస్యలు ఉండొచ్చు!
చేతులు, కాళ్లు దురద పెడుతున్నాయా? శరీరంలో ఈ సమస్యలు ఉండొచ్చు!
గురువు ముసుగులో వేధింపులు.. తరగతి గదిలో టీచర్‌ నిర్వాకం!
గురువు ముసుగులో వేధింపులు.. తరగతి గదిలో టీచర్‌ నిర్వాకం!
బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పటికీ తినలేనివి ఏమిటి? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పటికీ తినలేనివి ఏమిటి? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కొన్ని గంటల్లోనే కుప్పకూలిన బంగారం ధరలు.. ఎన్నడు లేనంతగా ఢమాల్‌!
కొన్ని గంటల్లోనే కుప్పకూలిన బంగారం ధరలు.. ఎన్నడు లేనంతగా ఢమాల్‌!
పిల్లలు తప్పక తెలుసుకోవాల్సిన దాహంతో ఉన్న కాకి కథ!
పిల్లలు తప్పక తెలుసుకోవాల్సిన దాహంతో ఉన్న కాకి కథ!
కల్లు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న రామచిలకలు..!
కల్లు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న రామచిలకలు..!
భారత్‌లో స్టార్‌లింక్‌ ప్రవేశంపై సునీల్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు..
భారత్‌లో స్టార్‌లింక్‌ ప్రవేశంపై సునీల్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు..
ఏది పడితే అది చేశా.. తర్వాత ఆలోచిస్తే అర్ధమైంది..
ఏది పడితే అది చేశా.. తర్వాత ఆలోచిస్తే అర్ధమైంది..