AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్ vs కోహ్లీ.. ఆ నైంటీస్ మిస్ కాకుంటే.. సెంచరీలలో తోపు ప్లేయర్ ఎవరో తెలుసా..?

Sachin Tendulkar vs Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. వరుస అర్ధశతకాలు, శతకాలతో దూసుకుపోతున్న ఈ రన్ మెషీన్ కెరీర్‌లో ఇప్పటివరకు సెంచరీల దగ్గర ఆగిపోయిన సందర్భాలు, నైంటీస్ స్కోర్ల వివరాలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సచిన్ vs కోహ్లీ.. ఆ నైంటీస్ మిస్ కాకుంటే.. సెంచరీలలో తోపు ప్లేయర్ ఎవరో తెలుసా..?
Sachin Tendulkar Vs Virat Kohli
Venkata Chari
|

Updated on: Sep 21, 2026 | 1:06 PM

Share

Sachin Tendulkar vs Virat Kohli: భారత క్రికెట్ జట్టు (Team India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నప్పటికీ తన జోరును తగ్గించలేదు. తాజాగా దక్షిణాఫ్రికా (South Africa) జట్టుపై రెండు శతకాలు బాదడంతో ఆయన అంతర్జాతీయ సెంచరీల సంఖ్య 84కు చేరింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉన్న 100 శతకాల ప్రపంచ రికార్డుకు కోహ్లీ కేవలం 15 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇటీవల వడోదర వేదికగా న్యూజిలాండ్ (New Zealand) జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ తృటిలో శతకం కోల్పోయాడు. 93 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆయన వెనుదిరగడంతో మరో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. వన్డే క్రికెట్‌లో ఆయన నైంటీస్ స్కోర్లలో ఔట్ కావడం ఇది 8వసారి కావడం గమనార్హం. 300లకు పైగా లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

IND vs JPN: జపాన్‌తో తలపడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్‌గా బుడ్డోడు ఫిక్స్..!

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ తర్వాతి స్థానంలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. సచిన్ 34 వేలకు పైగా పరుగులు చేయగా, కోహ్లీ 28 వేల పైచిలుకు పరుగులు సాధించారు. కోహ్లీ కెరీర్‌లో ఇప్పటివరకు వన్డేలలో 8 సార్లు, టెస్టులలో 2సార్లు, టీ20లలో 2సార్లు నైంటీస్ స్కోర్ల వద్ద నిలిచిపోయాడు. మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలుపుకుని ఆయన 12 సార్లు తొంభైల స్కోర్లలో వెనుదిరిగాడు. ఒకవేళ ఆ నైంటీస్ ఇన్నింగ్స్‌లను కనుక శతకాలుగా మలిచి ఉంటే ఆయన మొత్తం సెంచరీల సంఖ్య 96కు చేరి ఉండేది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: ఇంట్లో పులి.. విదేశాల్లో పిల్లి.. అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!

అయితే క్రికెట్‌లో ఇలాంటి ఊహాగానాలు కేవలం వినోదం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో కూడా అన్ని ఫార్మాట్లు కలుపుకుని 28 సార్లు నైంటీస్ స్కోర్లలో ఔట్ అయ్యాడు. ఆ లెక్కన సచిన్ రికార్డును మదింపు చేస్తే ఆయన సెంచరీల సంఖ్య 128కి చేరుకునేది. ఏది ఏమైనప్పటికీ క్రికెట్ అనేది సంఖ్యల ఆట కావడంతో ఇలాంటి ఆసక్తికర చర్చలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!