AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. జైస్వాల్ ఎంట్రీతో మారిన టీమిండియా లైనప్.. ఓపెనర్లుగా ఎవరంటే?

India vs West Indies: సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ (West Indies) జట్టుతో భారత్ తలపడనుంది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగే ఈ తొలి సమరం కోసం భారత క్రికెట్ జట్టు (Team India) ఇప్పటికే సన్నాహాలు ఆరంభించింది.

IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. జైస్వాల్ ఎంట్రీతో మారిన టీమిండియా లైనప్.. ఓపెనర్లుగా ఎవరంటే?
Ind Vs Wi 1st Odi
Venkata Chari
|

Updated on: Sep 21, 2026 | 11:27 AM

Share

India vs West Indies: వెస్టిండీస్ జట్టుతో జరగబోయే ప్రతిష్టాత్మక సిరీస్ ద్వారా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం క్రీడాభిమానుల్లో తీవ్ర ఉత్సాహం నింపుతోంది. ఇరు జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) బరిలోకి దిగనున్నారు. గతేడాది జులై నెలలో ఇంగ్లాండ్ (England) జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఈ జోడీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆ పర్యటనలో రోహిత్ 174 పరుగులు, గిల్ 188 పరుగులు సాధించి అదరగొట్టారు. ఇప్పుడు అదే జోరును విండీస్ గడ్డపై కూడా కొనసాగించాలని భావిస్తున్నారు.

ఇక మూడో స్థానంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగనుండగా, ఆయన ప్రదర్శనపై అందరి చూపు నిలిచింది. ఇంగ్లాండ్ సిరీస్‌లో నిలకడైన ఆటతీరు కనబరిచిన కోహ్లీ మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) అందుబాటులో లేకపోవడంతో నాలుగో స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను (Yashasvi Jaiswal) బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయిదో స్థానంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) బ్యాటింగ్‌కు రానున్నాడు. గత 10 మ్యాచ్‌లలో 49.22 సగటుతో 443 పరుగులు సాధించిన రాహుల్ మిడిలార్డర్‌లో పాతుకపోతున్నాడు.

ఎక్కువమంది చదివినది: ఇంట్లో పులి.. విదేశాల్లో పిల్లి.. అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!

ఇవి కూడా చదవండి

ఇక ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మ్యాచ్‌ను ఫినిష్ చేసే బాధ్యతలను భుజాన వేసుకోనున్నారు. బౌలింగ్ విభాగంలో పేస్ దళాన్ని మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj), ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna), గురనూర్ బ్రార్ (Gurnoor Brar) మోయనుండగా, అదనపు పేసర్‌గా నితీశ్ సహకరిస్తున్నాడు. స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), రవీంద్ర జడేజా సమర్థంగా నిర్వర్తించనున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us