AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడాకులపై క్లారిటీ ఇచ్చిన మేం వయసుకు వచ్చాం హీరోయిన్.. ఏమన్నదంటే

తెలుగు ప్రేక్షకులకు ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో పరిచయమైన నటి నీతి టేలర్ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఈ సినిమాలో ఆమె తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె సినిమాల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

Rajeev Rayala
|

Updated on: Sep 20, 2026 | 11:09 PM

Share
తెలుగు ప్రేక్షకులకు ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో పరిచయమైన నటి నీతి టేలర్ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఈ సినిమాలో ఆమె తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె సినిమాల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీ టెలివిజన్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోల్లోనూ సందడి చేసిన నీతి టేలర్.. 2020లో ఇండియన్ ఆర్మీ అధికారి పరిక్షిత్ బవాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

1 / 6
అయితే కొంతకాలంగా ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అయ్యాయి. తన వైవాహిక జీవితంపై వస్తున్న వార్తలకు తాజాగా నీతి టేలర్ స్పందించినట్లు తెలుస్తోంది.సోషల్ మీడియాలో ఏదైనా వార్త వైరల్ అయినంత మాత్రాన దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది. నిజం కాని విషయాలు తమను పెద్దగా ప్రభావితం చేయవని స్పష్టం చేసింది. తమ బంధం గురించి తమకు పూర్తిగా తెలుసని, తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తామే ఇష్టపూర్వకంగా తీసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం తామిద్దరం సంతోషంగా, క్షేమంగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నామని చెప్పింది.

2 / 6
తమ దాంపత్య జీవితంపై ఇలాంటి పుకార్లు, విమర్శలు చేయకుండా ఉండాలని, తమ సంతోషకరమైన జీవితానికి ఎవరూ దిష్టి పెట్టకూడదని కోరుకున్నట్లు వెల్లడించింది. దీంతో తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న ప్రచారానికి నీతి టేలర్ తనదైన శైలిలో స్పష్టత ఇచ్చినట్లైంది. నీతి టేలర్ గతంలో ఓటీటీ రియాలిటీ షో అలయన్స్ లో పాల్గొన్న సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించింది. మాజీ బాయ్‌ఫ్రెండ్ తనను సిగరెట్‌తో కాల్చి గాయపరిచాడని, హింసాత్మకంగా ప్రవర్తించడంతో పాటు మానసికంగా కూడా తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని తెలిపింది.

3 / 6
ఒక సందర్భంలో తన పుట్టినరోజు రాత్రి అతని ప్రవర్తన మరింత భయానకంగా మారిందని, తనపై దాడి చేశాడని చెప్పింది. అప్పటికి తాను చిన్న వయసులో ఉండటంతో మనుషుల స్వభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయానని నీతి టేలర్ పేర్కొంది. అతడి ప్రవర్తన తనకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంతో చివరకు ఆ బంధం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపింది. మాజీ సంబంధం కారణంగా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్న తన జీవితంలోకి పరిక్షిత్ రావడం ఎంతో ప్రత్యేకమని నీతి టేలర్ గతంలో చెప్పుకొచ్చింది. తన భర్త తన జీవితంలోకి వచ్చిన తర్వాత తాను ఎంతో సంతోషంగా ఉన్నానని పేర్కొంది.

4 / 6
ప్రస్తుతం పరిక్షిత్‌తో కలిసి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నానని ఆమె చెబుతున్న నేపథ్యంలో.. విడాకులపై వస్తున్న వార్తలకు కూడా ఈ వ్యాఖ్యలతో చెక్ పెట్టినట్లయింది. నీతి టేలర్ 1994 నవంబర్ 8న జన్మించింది. గుజరాతీ తండ్రి, కోల్‌కతాకు చెందిన బెంగాలీ క్రైస్తవ తల్లికి ఆమె జన్మించింది. నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి పలు ప్రముఖ సీరియల్స్, షోలలో నటించింది. తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో పరిచయమైన ఆమె.. ఆ తర్వాత ‘పెళ్లి పుస్తకం’ వంటి చిత్రాల్లోనూ కనిపించింది.

5 / 6
అయితే సినిమాల కంటే బుల్లితెరపైనే ఆమెకు ఎక్కువ గుర్తింపు లభించింది. పలు టీవీ షోలు, రియాలిటీ కార్యక్రమాలతో పాటు మ్యూజిక్ వీడియోల్లోనూ నటిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువైంది. మొత్తానికి నీతి టేలర్ వైవాహిక జీవితంపై కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె చేసిన వ్యాఖ్యలు తెరదించినట్లుగా కనిపిస్తున్నాయి. తమ బంధం గురించి తమకు తెలుసని, ప్రస్తుతం తామిద్దరం సంతోషంగా ఉన్నామని ఆమె స్పష్టం చేయడంతో విడాకుల వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లైంది.

6 / 6
Follow Us