AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరశివుని పూజకే కాకుండా.. పరగడుపున నాలుగు మారేడు ఆకులు నమిలితే కలిగేది అద్భుతమే!

మారేడు (బిల్వం) చెట్టును మన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. సాధారణంగా మారేడు ఆకులను కేవలం పూజలకే ఉపయోగిస్తారని చాలామంది అనుకుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం, మారేడు ఆకులలో అపారమైన మూలికా, వైద్య గుణాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున 4 నుండి 5 మారేడు లేత ఆకులను నమిలి రసాన్ని మింగడం వల్ల శరీరానికి ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

Jyothi Gadda
|

Updated on: Sep 21, 2026 | 6:56 AM

Share
పోషకాల గని: మారేడు ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ బి6, బి12, విటమిన్ సి, కాల్షియం, రిబోఫ్లేవిన్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు శక్తివంతమైన యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్,  యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి.

1 / 5
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: మారేడు ఆకులలో స్వల్ప చేదు, వగరు రుచులు ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున వీటిని నమలడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వచ్చి, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచి ఉపశమనం లభిస్తుంది.

2 / 5
అల్సర్, జీర్ణ సమస్యలకు చెక్: మారేడు ఆకులకు ఉండే హీలింగ్ గుణం వల్ల కడుపులో మరియు పేగుల్లో ఏర్పడే అల్సర్లను త్వరగా నయం చేస్తుంది. అజీర్ణం, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్ధకం, జీర్ణశయాశయ శోధ  వంటి సమస్యలను ఇది నివారిస్తుంది. శరీరంలోని అవయవాలను శుభ్రపరచడానికి మారేడు ఆకులు అద్భుతంగా తోడ్పడతాయి. పరగడుపున దీని రసం తీసుకోవడం ద్వారా కాలేయం, మూత్రపిండాలు లలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

3 / 5
రోగనిరోధక శక్తి పెరుగుదల: వీటిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. రుతుపవనాల మారే సమయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు నుండి రక్షణ కల్పించడంతో పాటు శరీరం రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడతాయి. నోటి పూత, నోటి దుర్వాసనను కూడా ఇవి తగ్గిస్తాయి.

4 / 5
ఎవరు తీసుకోకూడదు?: మారేడు ఆకులలో అనేక గుణాలు ఉన్నప్పటికీ, రక్తపోటును తగ్గించే స్వభావం దీనికి ఉంటుంది. కాబట్టి లో బీపీ ఉన్నవారు, గర్భిణులు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు మారేడు ఆకులను నేరుగా తీసుకోకూడదు. రోజువారీ జీవితంలో సహజసిద్ధమైన ఆరోగ్యాన్ని పొందడానికి, వైద్యుల సలహాతో ఉదయాన్నే కొన్ని మారేడు ఆకులను ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

5 / 5
Follow Us