17 ఏళ్ల బాలికపై మైనర్ల రేప్ ఆపై మర్డర్.. మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్న దుస్థితి!
ఢిల్లీలోని స్వరూప్‌నగర్‌లో ఓ టీనేజ్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 13న కుషక్ రోడ్ సమీపంలోని పొలాల్లో బాలిక మృతదేహం లభించింది. 50కిపైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఘటనకు సమీపంలో కనిపించిన టెంపో ఆధారంగా నిందితులను గుర్తించారు. 19 ఏళ్ల యువకుడితో పాటు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మానవత్వం మంటగలిసిపోయింది. మరో నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల మైనర్ బాలికపై కొందరు మృగాలు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి, కత్తులతో నరికి హత్య చేశారు. అంతటితో ఆగకుండా ఆ మృతదేహాన్ని స్వరూప్ నగర్‌లోని పొలాల్లో పడేశారు. సెప్టెంబర్ 13న కుషక్ రోడ్ సమీపంలోని పొలాల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శవం ఏ స్థాయిలో క్షీణించిపోయిందంటే.. అది ఆడపిల్లదా లేక మగపిల్లవాడిదా అని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ బృందాలకు సైతం సమయం పట్టింది. పోలీసుల ప్రకారం.. బాలికకు నిందితులతో ముందే పరిచయం ఉంది. వారంతా ఓ టెంపోలో కలిసి మద్యం సేవించిన తర్వాత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మృతదేహంలో కొంత భాగాన్ని వీధి కుక్కలు తినేశాయని పోలీసులు తెలిపారు. ఓ చేయి మృతదేహానికి దూరంగా పొలంలో లభించినట్లు చెప్పారు. అయితే, బాలిక కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. ఆమె తరచూ ఇంటి నుంచి వెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేదని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ దారుణ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు 50కి పైగా సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టి, ఒక టెంపో ఆధారంగా ఖడ్డా కాలనీకి చెందిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా అసలు దారుణం బయటపడింది. శివమ్ అలియాస్ సుదామా అనే వ్యక్తితో పాటు 16 నుంచి 17 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన రెండు కత్తులు, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండిగో బాదుడు.. దేశీయ విమాన ప్రయాణం మరింత భారం
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
PM Modi: 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే
Tirumala: తిరుమల వెళ్తున్నారా..? ఇది తెలియకపోతే ఇబ్బందులు తప్పవు
ఆంధ్రప్రదేశ్ మహిళలకు గుడ్‌న్యూస్.. ఇకపై గ్యాస్ సబ్సిడీ కోసం నో వెయిటింగ్!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

