AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో తింటుంటే అద్భుతమే..

ఆకలి లేనప్పుడు లేదా తక్కువ సమయంలో రుచికరమైనది తినాలనుకున్నప్పుడు, రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం సరైన ఎంపిక. కేవలం ఐదు నిమిషాల్లో తయారయ్యే ఈ సంప్రదాయ వంటకం వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. సులభమైన తయారీ విధానంతో ఈ కారం రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో తింటుంటే అద్భుతమే..
Ellipaya Karam
Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2026 | 11:11 AM

Share

ఏం తినబుద్ది కానప్పుడు.. ఎటువంటి కూరగాయలు లేనప్పుడు లేదా తక్కువ సమయంలో రుచికరమైన ఆహారం సిద్ధం చేయాలనుకున్నప్పుడు, రాయలసీమకు చెందిన ఎల్లిపాయ కారం ఒక అద్భుతమైన ఎంపిక.. ఈ సంప్రదాయ రెసిపీ కేవలం నాలుగైదు నిమిషాల్లోనే తయారుచేయవచ్చు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ వెల్లుల్లి కారాన్ని కలుపుకుని తింటే, దాని రుచికి ఏ ఇతర వంటకం సాటి రాదంటే అతిశయోక్తి కాదు. కమ్మగా, సంతృప్తికరంగా భోజనం చేయడానికి ఇది ఉత్తమమైన ఎంపిక.

ఎల్లిపాయ కారం తయారీకి కావలసిన పదార్థాలు:

  • వెల్లుల్లిపాయలు: ఒక మీడియం సైజు వెల్లుల్లి గడ్డ, పాయలుగా వలిచి (సుమారు 20 గ్రాములు)
  • ఎండు కొబ్బరి: రెండు అంగుళాల ముక్క (సుమారు 10 గ్రాములు), సన్నగా పొడవుగా కట్‌ చేయాలి
  • కల్లుప్పు: ఒక టేబుల్ స్పూన్ (సుమారు 10 గ్రాములు)
  • జీలకర్ర: అర టీ స్పూన్
  • కరివేపాకు: రెండు రెమ్మలు
  • కారం పొడి: రెండు టేబుల్ స్పూన్లు (సుమారు 20 గ్రాములు)
  • పసుపు: అర టీ స్పూన్

తయారీ విధానం:

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి పాయలుగా వలిచిన వెల్లుల్లిపాయలు, సన్నగా కట్‌ చేసుకున్న ఎండు కొబ్బరి, కల్లుప్పు, జీలకర్ర, కరివేపాకు, కారం పొడి, పసుపు వేయండి.

ఈ పదార్థాలన్నింటినీ నీళ్లు కలపకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. రోట్లో దంచుకుంటే రుచి మరింత బాగుంటుంది, కానీ మిక్సీలో కూడా ముద్దగా గ్రైండ్ చేసుకోవచ్చు.

గ్రైండ్ చేసుకున్న కారాన్ని పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయండి.

నూనె వేడయ్యాక, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి.

తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిర్చిని వేసి కొద్దిగా వేయించండి.

తాలింపు లైట్‌గా వేగాక, చిటికెడు ఇంగువ వేసి, వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం మొత్తాన్ని పాన్‌లో వేయండి.

కారాన్ని నూనెలో ఎక్కువ సేపు వేయించకుండా, ఒక్కసారి బాగా కలిపేసి వెంటనే స్టవ్ ఆపేయండి. ఆయిల్ నుండి తీసి పక్కకు దించుకోండి.

అంతే, రెండే నిమిషాల్లో రుచికరమైన వెల్లుల్లి కారం సిద్ధం. ఈ కారం రెండు నుండి మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అన్నంలోకి మాత్రమే కాకుండా, ఈ ఎల్లిపాయ కారాన్ని గుడ్డు వంటకాలతో, అలాగే కూరగాయలతో చేసుకునే పొడికూరల్లో కూడా వాడుకోవచ్చు. ఇంట్లో వంట చేయడానికి బద్దకంగా అనిపించినప్పుడు లేదా ఏదైనా సింపుల్‌గా, కారం కారంగా తినాలని అనిపించినప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని తప్పకుండా ప్రయత్నించి.. ఆస్వాదించండి..

Follow Us
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?
న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?
కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..
కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..
వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే
వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?