AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs JPN: జపాన్‌తో తలపడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్‌గా బుడ్డోడు ఫిక్స్..!

Team India Playing XI vs Japan: భారత్, జపాన్ మధ్య జరిగే ఏకైక టీ20 మ్యాచ్ ఆసియా క్రీడలకు ముందు ప్రాక్టీస్ కోసం కీలకం. ఈ చారిత్రక సుజుకి కప్ మ్యాచ్‌లో సీనియర్లకు విశ్రాంతినిచ్చి, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ వంటి యువ ఆటగాళ్లతో కూడిన కొత్త ప్లేయింగ్ 11 బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ రేపు ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

IND vs JPN: జపాన్‌తో తలపడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్‌గా బుడ్డోడు ఫిక్స్..!
India Vs Japan T20
Venkata Chari
|

Updated on: Sep 21, 2026 | 6:58 AM

Share

Team India Playing XI vs Japan: టీమిండియా జపాన్ పర్యటనకు చేరుకుంది. అక్కడ ఆసియా క్రీడలకు ముందు జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కేవలం ఒక వార్మప్ మ్యాచ్‌గానే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్, జపాన్ జట్లు తొలిసారి తలపడనున్నాయి కాబట్టి దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకైక టీ20 మ్యాచ్‌ను సుజుకి కప్ పేరుతో నిర్వహిస్తున్నారు. టీమిండియా నిన్న జపాన్‌కు చేరుకుంది. ఈరోజు తోచిగి ప్రీఫిక్చర్ లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో తొలి ప్రాక్టీస్ సెషన్ జరగనుంది. రేపు మంగళవారం ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ మ్యాచ్ తర్వాత, ఆగస్టు 24 నుంచి ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అందువల్ల, జపాన్‌తో జరిగే ఈ టీ20 మ్యాచ్ భారత్ వర్సెస్ జపాన్ ఇరు జట్లకు ఆసియా క్రీడలకు ముందు ఒక విలువైన ప్రాక్టీస్ అవకాశంగా ఉపయోగపడనుంది.

టీమిండియా ప్లేయింగ్ 11లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత..

జపాన్‌తో జరిగే ఏకైక టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంచనా ప్రకారం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం కల్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.

బ్యాటింగ్ ఆర్డర్‌లో, ఫస్ట్ డౌన్ లో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. ఆ తర్వాత తిలక్ వర్మ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. జట్టు కూర్పులో నలుగురు ఆల్ రౌండర్లను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్ ఆల్ రౌండర్ల కోటాలో ప్లేయింగ్ 11లోకి ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఫాస్ట్ బౌలర్లుగా అర్షదీప్ సింగ్, ఎస్. ఠాకూర్ లకు తుది జట్టులో అవకాశం రానుంది. స్పిన్ బాధ్యతలు రవి బిష్ణోయ్ చూసుకునే అవకాశం ఉంది.

మొత్తంమీద, ఈ ఏకైక టీ20 కోసం సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్, రవి బిష్ణోయ్, ఎస్. ఠాకూర్, అర్షదీప్ సింగ్‌లతో కూడిన ప్లేయింగ్ 11 బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో జట్టు..

ఈ జపాన్ పర్యటన, ఆసియా గేమ్స్‌లో టీమిండియా వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఆడనుంది. గౌతమ్ గంభీర్ కాకుండా లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్లేయింగ్ 11 కేవలం జపాన్‌తో జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌ కోసమే రూపొందించబడింది. ఆ తర్వాత జరిగే ఆసియా గేమ్స్‌లో భారత జట్టు మెయిన్ స్క్వాడ్‌తో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ ద్వారా యువ ఆటగాళ్లు తమ సత్తాను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం లభించనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us