మిక్స్‌డ్ ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Samatha

20 september 2026

Pic credit - Pinterest

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా రోజుకు ఏదైనా ఒక పండు తినాలి అని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

పండ్లు

అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది మిక్స్‌డ్ ఫ్రూట్స్ తింటున్నారు. మరి ఇలా మిక్స్‌డ్ ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు దీని గురించి తెలుసుకుందాం.

ఆరోగ్యానికి మంచిదేనా?

మిక్స్‌‌డ్ ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దీనిని తీసుకునే సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏవి అంటే?

జాగ్రత్తలు

అరటి పండు, మామిడి పండు వాటిలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని ఎక్కువ మొత్తంలో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంట.

అరటి పండ్లు, మామిడి

అలాగే అరటి పండు , ద్రాక్ష ఈ రెండూ కూడా కలిపి తీసుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని తక్కువ మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

అరటి , ద్రాక్ష

అలాగే మామిడి పండు, ద్రాక్ష పండ్లలో సహజ చక్కెరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కవ మొత్తం కలిపి తీసుకోవడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

మామిడి ద్రాక్ష

అంతే కాకుండా నారింజ పండ్లు, సిట్రస్ పండ్లు కూడా కలిపి తీసుకోకూడదంట. ఇవి కూడా ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు నిపుణులు.

నారింజ

అయితే పండ్లు కలిపి తినడం వలన హాని జరుగుతుంది అనే ఆధారాలు ఏమీ లేవు కానీ, తీసుకునే ముందు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు

పండ్లు కలిపి తినడం