AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bendakaya Fry: బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా రావాలంటే.. ఈ చిన్న చిట్కా తెలుసుకోవాల్సిందే

Bendakaya Vepudu Recipe Telugu: తెలుగువారి రోజువారి భోజనంలో వేపుళ్లకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అందులోనూ బెండకాయ వేపుడు ఎంతోమందికి ఇష్టమైన వంటకం. అయితే బెండకాయల్లో ఉన్న సహజ సిద్ధమైన జిగురు వల్ల వేయించేటప్పుడు ముద్దగా అయిపోవడం చాలామందికి ఎదురయ్యే ఇబ్బంది.

Phani CH
|

Updated on: Aug 11, 2026 | 1:06 PM

Share
సాధారణంగా నాన్-స్టిక్ పాన్‌లలో కాకుండా మామూలు ఐరన్ లేదా స్టీల్ బాండీలలో కూడా జిగురు లేకుండా పొడిపొడిగా బెండకాయ వేపుడు చేయవచ్చు.  కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే కరకరలాడుతూ ఎంతో రుచికరమైన బెండకాయ వేపుడు సిద్ధమవుతుంది.

1 / 5
ఈ బెండకాయ వేపుడు తయారీ కోసం ముందుగా అర కేజీ తాజా బెండకాయలను తీసుకుని నీటితో శుభ్రంగా కడిగి, జల్లెడ గిన్నెలో వేసి నీళ్లన్నీ పోయే వరకు 10 నిమిషాలు ఆరబెట్టాలి. ఆ తర్వాత బెండకాయలను మరీ సన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి.

2 / 5
బాండీలో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి తాలింపు వేయించాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తరుగు వేసి నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్‌పై వేయించాలి.

3 / 5
బెండకాయ వేపుడు పొడిపొడిగా రావడానికి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే—ముక్కలు వేసిన వెంటనే ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే జిగురు ఎక్కువై ముద్దవుతుంది. అలాగే గరిటెతో ఎక్కువగా కలుపుకుండా నిమిషం వ్యవధితో నెమ్మదిగా తిప్పుతూ వేయించాలి.

4 / 5
5 నిమిషాల తర్వాత జిగురంతా పోయాక కరివేపాకు, పసుపు వేసి సన్నటి మంటపై వేయించాలి. బెండకాయలు బాగా వేగి పొడిపొడిగా మారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించాలి. చివరగా ఒకటిన్నర టీస్పూన్ల కారం వేసి కలిపి దింపేస్తే ఎంతో రుచికరమైన పొడిపొడి బెండకాయ వేపుడు సిద్ధమవుతుంది.

5 / 5
Follow Us