AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మందిని చంపగలదు!

ప్రపంచంలో అనేక రకాల పాములు ఉన్నప్పటికీ, కొన్ని పాముల విషం క్షణాల్లో మనుషుల ప్రాణాలను తీయగలదు. కింగ్ కోబ్రాను ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాముగా పరిగణిస్తారు. దీని ఒక్క కాటులో వందలాది మందిని లేదా ఒక పెద్ద ఏనుగును కూడా చంపేంత విషం ఉంటుంది. అయితే, అత్యంత తీవ్రమైన విషం ఉన్న పాము మాత్రం కింగ్‌ కోబ్రా కాదని మీకు తెలుసా..? ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాములు ఏవో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మందిని చంపగలదు!
Most Venomous Snakes
Jyothi Gadda
|

Updated on: Aug 11, 2026 | 7:24 PM

Share

సరీసృపాల ప్రపంచంలో పాములు అత్యంత భయంకరమైనవి. ప్రపంచవ్యాప్తంగా వేలాది జాతుల పాములు ఉన్నప్పటికీ, అందులో కొన్ని మాత్రమే అత్యంత ప్రాణాంతకమైన విషాన్ని కలిగి ఉంటాయి. వీటి కాటుకు సరైన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణాలు దక్కడం అసాధ్యం.

ఇన్లాండ్ తైపాన్:

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విషం ఉన్న పాము ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్లాండ్ తైపాన్. దీనిని ఫియర్స్ స్నేక్ అని కూడా పిలుస్తారు. దీని ఒక్క కాటులో విడుదలయ్యే విషం దాదాపు 100 మంది పెద్ద వయస్కులను లేదా 2.5 లక్షల ఎలుకలను చంపగలదు. దీని విషం న్యూరోటాక్సిక్ రకానికి చెందినది. ఇది నాడీ వ్యవస్థను క్షణాల్లో పక్షవాతానికి గురిచేస్తుంది.

కింగ్ కోబ్రా:

ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపాము కింగ్ కోబ్రా. ఇది సాధారణంగా 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. కింగ్ కోబ్రా విషం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కసారిగా అత్యధిక మోతాదులో విషాన్ని శరీరంలోకి పంపుతుంది. దీని ఒక్క కాటుతో ఒక పెద్ద ఆసియా ఏనుగు కూడా కొన్ని గంటల్లోనే మరణించవచ్చు. ఇది ఇతర పాములను కూడా వేటాడి తింటుంది.

ఇవి కూడా చదవండి

బ్లాక్ మంబా :

ఆఫ్రికా ఖండంలో కనిపించే బ్లాక్ మంబా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే పాము. ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదలగలదు. దీని కాటుకు సకాలంలో యాంటీ-వెనమ్ ఇవ్వకపోతే మరణించే అవకాశం 100శాతం ఉంటుంది.

సా-స్కేల్డ్ వైపర్:

పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మనుషుల మరణాలకు కారణమయ్యే పాము సా-స్కేల్డ్ వైపర్. భారతదేశంలో ఎక్కువగా కనిపించే నాలుగు ప్రధాన విషపాములలో ఇది ఒకటి. దీని విషం రక్తాన్ని గడ్డకట్టకుండా చేసి అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది.

ఈ విషపూరిత పాముల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండటం, పాము కాటుకు గురైనప్పుడు నాటు వైద్యం ఆశ్రయించకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లడం అత్యంత ముఖ్యం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us