రంగుల పాపడ్లు పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆహారం. అయితే, వీటి తయారీలో ఉపయోగించే సింథటిక్ రంగులు తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. క్యాన్సర్, ఏడీహెచ్డీ, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు వీటిని ఇప్పటికే నిషేధించాయి. పిల్లలకు వీటిని దూరం ఉంచడం శ్రేయస్కరం.