AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghava Lawrence: విజయ్ బాటలోనే రాఘవలారెన్స్.. అక్కడ ఎన్నికల్లో పోటీ.?

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. వెండితెర ‘దళపతి’ విజయ్, రాజకీయ క్షేత్రంలో ‘అధినేత’గా విజయ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యారు విజయ్ .

Raghava Lawrence: విజయ్ బాటలోనే రాఘవలారెన్స్.. అక్కడ ఎన్నికల్లో పోటీ.?
Lawrence, Vijay
Rajeev Rayala
|

Updated on: Jun 05, 2026 | 6:50 PM

Share

తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. దశాబ్దాలుగా వెండితెరపై హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజా సేవ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిలిచారు. ఇన్నాళ్లు సినిమాల్లో స్టార్ హీరోగా రాణించిన విజయ్ ఇప్పుడు సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు. కాగా విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు. అయితే, నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాలి. విజయ్ పెరంబూర్‌ను అట్టిపెట్టుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానాన్నివదులుకున్నారు. పెరంబూర్ నుంచి కొనసాగుతున్నారు విజయ్. త్వరలోనే విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ లో బై ఎలక్షన్ జరగనుంది. అయితే ఈ స్థానంలో ఎవరు పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే ఈ స్థానంలో హీరోయిన్ త్రిష పోటీ చేస్తున్నారని టాక్ కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. గతంలో త్రిష  రాజకీయాల్లోకి వస్తాను అంటూ చేసిన కామెంట్స్ ఆధారంగా ఇప్పుడు ఆమె తిరుచ్చి ఈస్ట్ లో పోటీ చేస్తుందని వార్తలు జోరుగా ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు మరో నటుడి పేరు కోలీవుడ్ లో వినిపిస్తుంది. ఆ నటుడు ఎవరో కాదు కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు రాఘవ లారెన్స్. నటుడిగానే కాదు సామజిక సేవలోనూ లారెన్స్ ఎప్పుడూ ముందుటారు.

కష్టాల్లో ఉన్న ఎంతో మందిని రాఘవ లారెన్స్ ఆదుకున్నారు. సామజిక సేవతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు లారెన్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలుస్తుంది. విజయ్ కు లారెన్స్ మంచి సన్నిహితుడు. విజయ్ కు కొరియోగ్రాఫర్ గా కొన్ని సినిమాలు చేశారు లారెన్స్. ఇక ఇప్పుడు విజయ్ రాజీనామా చేసిన  తిరుచ్చి ఈస్ట్ లో లారెన్స్ పోటీ చేస్తారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. లారెన్స్ లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని తిరుచ్చి తూర్పు బరిలో నిలిపితే పార్టీ విజయం వరిస్తుందని టీవీకే పార్టీ భావిస్తుందని టాక్.. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us